ISRO : పీఎస్ఎల్ వీ-సీ52 ప్రయోగం విజయవంతం.. వివరాలు...

Published : Feb 14, 2022, 07:08 AM ISTUpdated : Feb 14, 2022, 07:24 AM IST
ISRO : పీఎస్ఎల్ వీ-సీ52 ప్రయోగం విజయవంతం.. వివరాలు...

సారాంశం

శ్రీహరికోట నుంచి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేప్పట్టిన శాటిలైట్ లాంచ్ ప్రయోగం విజయవంతం అయ్యింది. ఈ ఉదయం లాంచ్ వెహికిల్ విజయవంతంగా మూడు ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టింది.

శ్రీహరికోట : Indian Space Research Organization చేపట్టిన  పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సీ-15 ప్రయోగం విజయవంతం అయ్యింది.  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాSriharikotaలోని 
Satish Dhawan Space Launch Center నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు.  25.30 గంటల కౌంట్డౌన్ అనంతరం  ఈ ఉదయం 5 గంటల 59 నిమిషాల కు  వాహన నౌక ఆర్ఐశాట్-1,  ఐఎన్ఎస్-2టీడీ, ఇన్స్పైర్ శాట్-1 ఉపగ్రహాలను నింగిలోకి దూసుకెళ్లింది. 18. 31 నిమిషాల  తర్వాత ఈ మూడు ఉపగ్రహాలను  Rocket orbitలోకి ప్రవేశపెట్టింది.

Isro 2022లో ఇదే మొదటి ప్రయోగం. అంతేకాకుండా  isro అధిపతిగా  నియామకమైన డాక్టర్ సోమనాథ్ ఆధ్వర్యంలో చేపట్టిన తొలి ప్రయోగం ఇది.

కక్ష్యలో ప్రవేశ పెట్టిన ఉప గ్రహాలు ఇవే..

ఆర్ఐశాట్-1 :  ఈ ఉపగ్రహం ద్వారా ఎక్కువగా ప్రయోజనాలు కలుగుతాయి. దీని కాలపరిమితి పదేళ్లు. రేయింబవళ్లు అన్ని వాతావరణ పరిస్థితుల్లో పనిచేసేలా రూపొందించారు. ఉపగ్రహంలో అధిక డేటా నిర్వహణ వ్యవస్థలు, అధిక నిల్వ పరికరాలు ఉన్నాయి. వ్యవసాయం,  అటవీ, నీటి వనరుల నిర్వహణ కోసం విలువైన సమాచారాన్ని కనుగొనేందుకు ఈ ఉపగ్రహం ఇమేజింగ్ డేటా ఉపయోగపడనుంది. దీని బరువు  1710 కిలోలు.

ఐఎన్ఎస్-2టీడీ : భారత్,  భూటాన్ కలిసి రూపొందించిన ఈ ఉపగ్రహ జీవిత కాలం ఆరు నెలలు భవిష్యత్తులో సైన్స్ ప్రయోగాత్మక కోసం రూపొందించారు దీని బరువు 17.5 కిలోలు.

ఇన్స్పైర్ శాట్-1 :  విశ్వవిద్యాలయాల విద్యార్థులు తయారుచేసిన ఈ ఉపగ్రహం బరువు 8.1 కిలోలు. జీవిత కాలం ఏడాది. తక్కువ  భూ కక్షలో ఉండే ఈ ఉపగ్రహంలో భూమి అయానోస్పియర్ అధ్యయనం నిమిత్తం కాంపాక్ట్ అయానోస్పియర్ ప్రోబ్ అమర్చి ఉంటుంది. 

కాగా, ఇటీవల కరోనా కారణంగా ఇస్రో(ISRO) ప్రయోగాలూ కొంత వెనుకబాటు పట్టాయి. వాటికి తోడు గతేడాది వైఫల్యాలు ఇస్రో వేగాన్ని కొంత తగ్గించాయి. గతేడాది ఇస్రో కేవలం ఒకే ఒక్క ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. గత రెండేళ్లల్లో కేవలం మూడే ప్రయోగాలను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించింది. కాగా, ప్రధాన ప్రాజెక్టులను ఇస్రో మరికొన్ని నెలలు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. 

ఇదిలా ఉండగా.. ఈ ఏడాది మాత్రం ఇస్రో చాలా బిజీ ఇయర్‌గా మారనున్నట్టు తెలుస్తున్నది. చంద్రయాన్-3, మానవ రహిత గగన్‌యాన్ మిషన్ వంటి ప్రధాన ప్రాజెక్టులనూ ఈ ఏడాదిలో విజయవంతం చేసుకునే పనిలో ఉండనుంది. ఇదిలా ఉండగా, ఈ ఏడాది తొలి శాటిలైట్ ప్రయోగాన్ని ఫిబ్రవరి 14వ తేదీ ఉదయం నిర్వహించనుంది. ఇందుకోసం ఇప్పటికే అంటే 13వ తేదీ ఉదయమే కౌంట్‌డౌన్ ప్రారంభం అయింది.

శ్రీహరికోటలోని సతీష్ దావన్ స్పేస్ సెంటర్ ఫస్ట్ లాంచ్ ప్యాడ్‌ నుంచి ఫిబ్రవరి 14 ఉదయం 5.59 గంటలకు ఇస్రో పీఎస్‌ఎల్‌వీ-సీ52 ద్వారా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్(ఈవోఎస్-04/EOS-04)ను ప్రయోగించనుంది. ఈ ప్రయోగాన్ని ఇస్రో అధికారిక యూట్యూబ్ చానెల్‌లో లైవ్‌లో ప్రసారం చేయనున్నారు. 1710 కిలోల భారం ఉన్న ఈవోఎస్-04 ఉపగ్రహం సూర్యుడితో సింక్‌లో ఉండి 529 కిలోమీటర్ల పోలార్ ఆర్బిట్‌లో తిరుగుతుంది.
 

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !