బీజేపీలో చేరితే బెయిల్... అఖిల్ గొగోయ్ సంచలన ఆరోపణలు..!

By AN Telugu  |  First Published Mar 24, 2021, 11:16 AM IST

జైల్లో తనను మానసికంగా, శారీరకంగా హింసించారని యాంటీ సీఏఏ యాక్టివిస్ట్ అఖిల్ గొగోయ్ ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీలో చేరితే తనకు వెంటనే బెయిల్ ఇస్తామని ఎన్ఐఏ ఆశ చూపిందంటూ అఖిల్ లెటర్ రాశారని ఆయనకు చెందిన రైజోర్‌ దళ్‌ వెల్లడించింది. 


జైల్లో తనను మానసికంగా, శారీరకంగా హింసించారని యాంటీ సీఏఏ యాక్టివిస్ట్ అఖిల్ గొగోయ్ ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీలో చేరితే తనకు వెంటనే బెయిల్ ఇస్తామని ఎన్ఐఏ ఆశ చూపిందంటూ అఖిల్ లెటర్ రాశారని ఆయనకు చెందిన రైజోర్‌ దళ్‌ వెల్లడించింది. 

కోర్టు అనుమతి లేకుండా అఖిల్ ను 2019 డిసెంబర్ లో ఢిల్లీకి తీసుకుపోయారని తెలిపింది. అక్కడ ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ లో తనను బంధించారని, గాఢమైన చలిలో నేలమీద పడుకోవాల్సి వచ్చిందని అఖిల్ లేఖలో పేర్కొన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లలో చేరితే బెయిల్ పొందొచ్చని ఆఫర్ ను తిరస్కరిస్తే, కావాలంటే అసెంబ్లీకి పోటీ చేసి మంత్రి కావచ్చని ఆశ చూపారన్నారు.  

Latest Videos

undefined

అంతేకాకుండా కేఎంఎస్‌ఎస్‌(కృషిక్‌ ముక్తి సంగ్రామ్‌ సమితి)ని వీడి ఒక ఎన్జీవో ఆరంభించి, అసోంలో క్రిస్టియన్ మత మార్పిడులకు వ్యతిరేకంగా పనిచేస్తూ రూ. 20 కోట్లు ఇస్టామని ప్రలోభపెట్టారన్నారు. 

వీటినేమీ తాను అంగీకరించకపోవడంతో అసోం సీఎం, ఒక ప్రభావవంతమైన మంత్రితో సమావేశం ఏర్ాటు చేస్తామని చెప్పారని, దీన్ని కూడా తాను వ్యతిరేకించానని తెలిపారు. దీంతో తనపై ఎస్ఐఏ తీవ్రమైన ఆరోపణలతో కూడిన కేసులు పెట్టిందన్నారు. తనను చంపేస్తానంటూ బెదిరింపులు కూడా వచ్చాయని, పదేళ్లు జైలు జీవితం గడపాలని భయపెట్టారని తెలిపారు. 

కోవిడ్ కారణంగా అఖిల్‌ను గౌహతి మెడికల్ కాలేజీలో చేర్చారు. యాంటీ సీఏఏ 
ఆందోళనల్లో పాల్గొన్నాడంటూ అఖిల్ ను ఎన్‌ఐఏ 2019లో అరెస్టు చేసింది. అయితే అఖిల్ ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది. 

ఇవన్నీ చౌకబారు రాజకీయాలని బీజేపీ ప్రతినిధి రూపమ్ గోస్వామి ఆరోపించారు. అసోం ఎన్నికలకు ముందు ఈ లేఖ విడుదల కావడమే ఇందుకు నిదర్శనమన్నారు. అఖిల్ కు ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కదన్నారు. 

కాగా రేజర్ పార్టీ అసెంబ్లీ జనతా పరిషత్ (ఏజేపీ) తో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. గౌహతి మెడికల్ కాలేజీ హాస్పిటల్ నుండి పోటీ చేస్తోన్న గొగోయ్ శివసాగర్ సీటు నుంచి పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. 

click me!