బీడీ కోసం గొడవ.. తండ్రిని చంపిన కొడుకు..!

Published : Feb 24, 2022, 09:39 AM ISTUpdated : Feb 24, 2022, 10:12 AM IST
బీడీ కోసం గొడవ.. తండ్రిని చంపిన కొడుకు..!

సారాంశం

దీంతో.. ఈ విషయంలో తండ్రీ, కొడుకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆవేశంతో సదరు యువకుడు తండ్రిని కిరాతకంగా దాడి చేశాడు.

బీడీ కోసం ఓ వ్యక్తి కన్న తండ్రిని అతి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన అస్సాంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అస్సాంలోని బార్పేట ప్రాంతానికి చెందిన ఓ యువకుడు.. కన్న తండ్రిని హత్య చేశాడు.

 యువకుడు.. తన తండ్రిని బీడీ కావాలని అడిగాడు. అతను వెంటనే కొడుక్కి ఒక బీడీ ఇచ్చాడు. అయితే.. ఒకటి సరిపోదని మరో బీడీ కావాలని అడిగాడు. రెండో బీడీ ఇవ్వడానికి తండ్రి అంగీకరించలేదు. దీంతో.. ఈ విషయంలో తండ్రీ, కొడుకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆవేశంతో సదరు యువకుడు తండ్రిని కిరాతకంగా దాడి చేశాడు.

ఈ దాడిలో  తీవ్రంగా గాయపడిన తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు వారు చెప్పాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 


 

PREV
click me!

Recommended Stories

Traffic Rules: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ఇక అంతే సంగ‌తులు.. కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న
మోదీ ప‌ర్య‌ట‌న‌వేళ తీవ్ర క‌ల‌క‌లం.. న‌కిలీ ఐడీ, తుపాకీతో ప‌ట్టుబ‌డ్డ వ్య‌క్తులు