
పుణె : Story writerకు కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలనుకున్నాడేమో ఓ వ్యక్తి.. చక్కగా మోసాలు చేస్తూ.. వాటిల్లో Twistల మీద ట్విస్టులు పెడుతూ.. వాటినే కథలుగా రాసుకొచ్చాడు. పాఠకుడిని ఆకర్షించే Crime, sex లాంటి మాస్ మసాలా అంతా అందులో చొప్పించాడు. అంతకు మించి Suspense thrillerలా సాగడమూ ఉంది.. ఇంకేం అతనికి రచయితగా పేరొచ్చింది.
అయితే అతని రచనలు అన్నీ నిజజీవితంలో అతను చేసిన మోసాలే అని తెలియడంతో ఇప్పుడు అతని అభిమానులు నోరు వెళ్లబెడుతున్నారు. చేయి తిరిగిన రచయితలు కూడా ఈ స్టోరీ తెలిసి ఔరా.. కథలు రాయాలంటే ఇలా చేయాలా? మాకు తెలీక ఊహాశక్తికి.. మేధస్సుకు పనిపెడుతున్నామే అనుకునేలా చేశాడీ.. మహానగరంలో మాయగాడైన రచయిత.. వివరాల్లోకి వెడితే...
మోసాలు చేసి వాటిని కథలుగా రాస్తూ రచయితగా మారిన వ్యక్తిని Pune Cyber Crime పోలీసులు అరెస్టు చేశారు. పదేళ్లుగా ఉన్నత కుటుంబాలకు చెందిన మహిళలతో సన్నిహితంగా ఉన్న నిందితుడు Anoop Manore.. అనేకమంది బడా బాబులను మోసం చేశాడు అన్నది ప్రధాన ఆరోపణ. కొంతమంది మహిళలు సైతం అతనితో పాటు ఈ మోసాలలో పాలుపంచుకున్నారు. హిందీ, మరాఠీ, ఇంగ్లీష్ భాషల్లో అనూప్ మనోరే కథలు రాసేవాడు. మరాఠీ చిత్ర పరిశ్రమ లో చాలామంది ప్రముఖులతో అతడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
ఉన్నత కుటుంబాల మహిళలతో శారీరక సంబంధాలు ఉన్నాయని చెప్పుకుంటూ అనేక మందిని మోసం చేశాడు. ఆ మహిళలతో లైంగిక సంబంధానికి అవకాశం కల్పిస్తానని పలువురు పురుషులకు అనూప్ వల వేసేవాడు. అనంతరం వారి నుంచి భారీగా డబ్బు వసూలు చేసేవాడు. బడాబాబులని నమ్మించేందుకు మహిళల పేరుతో తెరిచిన బ్యాంకు అకౌంట్ లలోనే నగదు జమ చేయించేవాడు. ఈ బ్యాంకు ఖాతాల కోసం అనుప్ మరో కుట్రకు తెర తీశాడు.
మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చేవాడు. వాటిని చూసి సంప్రదించిన మహిళల వివరాలతో బ్యాంక్ అకౌంట్ తెరిచేవాడు. ఇందుకు బదులుగా ప్రతినెల రూ. 5000 చెల్లించేవాడు ఆ ఖాతాలో డిపాజిట్ అయిన సొమ్మును మాత్రం తనే తీసుకునేవాడు. ఖాతాలు తెరిచిన వారు, లైంగిక సంబంధాల కోసం డబ్బులు జమ చేసిన వారినే పాత్రలుగా మలిచి కథలు రాసే వాడు.
ఇలా ఎంతో మంది తమకు తెలియకుండానే అనూప్ కథల్లో పాత్రధారులు అయిపోయారు. ఈ క్రమంలో రూ.60 లక్షలు బ్యాంకు ఖాతాలో జమ చేయాలని తనపై ఒత్తిడి తెచ్చారని పూనేకు చెందిన దీపాలి శిందే (76) అనే వ్యాపారవేత్త ఇచ్చిన ఫిర్యాదుతో అసలు విషయం బయటపడింది. గణేష్ శెలార్ పేరుతో దీపాలీ శిందే ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు విచారించగా.. అనూప్ మనోరేయే గణేశ్ అని తేలింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.