మీ చేపలు తింటే క్యాన్సర్ ..? ఆంధ్రా చేపలపై అస్సాం నిషేధం

First Published Jul 12, 2018, 5:50 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చే చేపల్లో దీని శాతం అధికంగా ఉందని అధికారులు తెలిపారు. దీంతో ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి చేపల దిగుమతి, అమ్మకాలను 10 రోజుల పాటు నిషేధిస్తూ ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి పీజూష్ హజారికా ఆదేశాలు జారీ చేశారు

దేశవ్యాప్తంగా ఆంధ్రా చేపలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఏ మూలకి వెళ్లినా.. ఆంధ్రా చేపల కూర, ఆంధ్రా రొయ్యల కూర అంటూ పెద్ద పెద్ద బోర్డులు మనకు కనిపిస్తాయి. అలాంటిది ఆంధ్రా చేపలను నిషేధిస్తున్నట్లు అస్సాం ప్రభుత్వం ప్రకటించింది. వివరాల్లోకి వెళితే.. ఇతర రాష్ట్రాల నుంచి అస్సాంకు దిగుమతి అవుతున్న చేపల్లో క్యాన్సర్‌ను కలిగించే ప్రాణాంతక రసాయం ఫార్మాలిన్ ఉన్నట్లు ఆ రాష్ట్ర అధికారులు గుర్తించారు.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చే చేపల్లో దీని శాతం అధికంగా ఉందని అధికారులు తెలిపారు. దీంతో ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి చేపల దిగుమతి, అమ్మకాలను 10 రోజుల పాటు నిషేధిస్తూ ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి పీజూష్ హజారికా ఆదేశాలు జారీ చేశారు..

జిల్లా కలెక్టర్లు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏపీ చేపలు రాష్ట్రంలోని మార్కెట్లలో విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.. ఉత్తర్వులను ఉల్లంఘించి ఫార్మాలిన్ రసాయనం ఉన్న చేపలను విక్రయించినా.. దిగుమతి చేసుకున్నా 2 ఏళ్ల నుంచి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 లక్షల జరిమానా విధిస్తామని మంత్రి హెచ్చరించారు. అలాగే చేపలను నిల్వ చేసేందుకు ఫార్మాలిన్ కలపకుండా అవసరమైన చర్యలను తీసుకోవాలని వైద్యశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.
 

click me!