తోటి వైద్యురాలిపై అత్యాచారం... డాక్టర్ అరెస్ట్..!

Published : Jun 25, 2021, 09:05 AM ISTUpdated : Jun 25, 2021, 09:08 AM IST
తోటి వైద్యురాలిపై అత్యాచారం... డాక్టర్ అరెస్ట్..!

సారాంశం

అస్సాంలోని దిబ్రూఘర్ జిల్లాలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఓ డాక్టర్ విధులు నిర్వహిస్తున్నాడు. అదే హాస్పిటల్ లో ఓ మహిళా వైద్యురాలు విధులు నిర్వహిస్తోంది. 

తోటి వైద్యురాలిపై ఓ డాక్టర్ కన్నేశాడు. రాత్రిపూట విధుల్లో ఉన్న ఆ మహిళా వైద్యురాలిపై డాక్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా.. నిందితుడిని పోలీసులు అరెస్టుచేశారు. ఈ సంఘటన అస్సాంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అస్సాంలోని దిబ్రూఘర్ జిల్లాలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఓ డాక్టర్ విధులు నిర్వహిస్తున్నాడు. అదే హాస్పిటల్ లో ఓ మహిళా వైద్యురాలు విధులు నిర్వహిస్తోంది. కాగా.. ఆమెపై ఈ డాక్టర్ కన్నుపడింది. ఇటీవల ఆమె రాత్రిపూట విధులు నిర్వహిస్తుండగా... ఆమెపై బలత్కారానికి పాల్పడ్డాడు.

దీంతో.. బాదితురాలు మరుసటి రోజు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు Section 376 అత్యాచారం కేసు కింద నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మహిళా వైద్యురాలుని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  బాధిత మహిళ కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి  ఉంది.  

PREV
click me!

Recommended Stories

జానకమ్మ జీవితం..ఓ చరిత్ర ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా? | Singer S. Janaki Biography | S Janaki Assets
గాన కోకిల జానకమ్మ చివరి మాటలు ఇవే | Singer S. Janaki No More | Singer S. Janaki Last Word