
Himanta Biswa Sarma: అసోం ముఖ్యమంత్రిపై సంచలన ఆరోపణలు చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు. పీపీఈ కిట్ల కొనుగోలు విషయంలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అసోంలో పెద్ద కుంభకోణం జరిగిందని, సీఎం సమక్షంలోనే కుంభకోణం జరిగిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు.
అవినీతి ఆరోపణలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ వివరణ ఇచ్చారు. దీనిపై అసోం సీఎం వివరణ ఇస్తూ.. సిసోడియాపై విమర్శాస్త్రాలు సంధించారు. తన భార్యపై సిసోడియా చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తన భార్య సామాజిక బాధ్యతగా.. పిపిఇ కిట్‌లను విరాళంగా ఇచ్చిందని, ఇందుకోసం ప్రభుత్వం ఆమెకు ఏమీ చెల్లించలేదని పేర్కొన్నారు. తన భార్యపై వచ్చిన అవినీతి ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. మనీష్ సిసోడియా పరువు నష్టం కేసును ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
దేశం తీవ్రమైన కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్నప్పుడు అస్సాంలో పిపిఇ కిట్‌లు లేవని అస్సాం ముఖ్యమంత్రి అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో తన భార్య 1500 కిట్‌లను కోనుగోలు చేసి.. ప్రభుత్వానికి ఉచితంగా అందించారని తెలిపారు.
అస్సాం సిఎం ట్వీట్‌లో ఇలా రాశారు.. 'మనీష్ సిసోడియా జీ.. మీరు ఆ సమయంలో భిన్నమైన రూపాన్ని చూపించారు. ఢిల్లీలో చిక్కుకుపోయిన అస్సాం ప్రజలను ఆదుకోవాలంటూ నేను ఎన్నిసార్లు మిమ్ములను అడిగినా మీరు పట్టించుకోలేదు. ఢిల్లీలోని మార్చురీ నుండి అస్సాంకు చెందిన కరోనా బాధితుడి మృతదేహాన్ని సేకరించడానికి నేను 7 రోజులు వేచి ఉండాల్సి వచ్చింది. ఆ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. అని ట్విట్ చేశారు.
మనీష్ సిసోడియా ఆరోపణ ఏమిటి?
కరోనా పస్ట్ వేవ్ సమయంలో (2020లో) పీపీఈ కిట్ల కొనుగోలులో వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, అసోం సీఎం హిమంత శర్మ..తన సతీమణికి చెందిన సంస్థ ను అక్కడి ప్రభుత్వం ఎక్కువ ధరకు PPE కిట్లు కొనుగోలు చేశారని సిసోడియా ఆరోపించారు. అవే పీపీఈ కిట్లను ఇతర సంస్థల దగ్గర తక్కువ ధరకు అసోం సర్కార్ కొనుగోలు చేసిందని సిసోడియా అన్నారు. ఇందుకు తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. హిమంత బిస్వా శర్మ 2020లో ఆరోగ్య మంత్రిగా ఉన్నారు.
ఆ సమయంలో PPE కిట్లను కొనుగోలు చేయడానికి టెండర్లు జారీ చేయబడ్డాయి. ఈ సమయంలో ఒక్కోక్కొ పీపీఈ కిట్ ను 600 రూపాయల నుంచి 990 రూపాయల వరకు చేసి.. 1680 రూపాయలకు అమ్మకాలు చేశారని అన్నారు. ఈ బహిరంగ అవినీతిపై బీజేపీ ఎందుకు మౌనం వహిస్తోందని ఆయన ప్రశ్నించారు. ఇది నేరమా కాదా? పీపీఈ కిట్ ను 600 రూపాయాలకు కొనుగోలు చేసి 1680 రూపాయలకు అమ్మడం మోసమా? కాదా? అని ప్రశ్నించారు. మీ ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకునే ధైర్యం బీజేపీకి ఉందా అని కేంద్రం పెద్దలను సిసోడియా నిలదీశారు.