
Earthquake In Andaman Sea: అండమాన్ సముద్రంలో ఆదివారం భూకంపం సంబంధించింది.
మధ్యాహ్నం 2:21 గంటల ప్రాంతంలో భూమి తీవ్రంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 4.6 గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు తెలియజేసింది. పోర్ట్ బ్లెయిర్ సమీపంలోని అండమాన్ సముద్రంలో 40 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు ఒక ట్వీట్‌లో తెలియజేశారు. అయితే, ఈ భూకంపం వల్ల సంభవించిన ప్రాణ, ఆస్తి నష్ట వివరాలను పేర్కొనలేదు.
అయితే, ఈ భూకంపం వల్ల అండమాన్ సముద్రంలో సునామీని సృష్టించే అవకాశం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అలాగే.. ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో శనివారం కూడా అదే స్థాయిలో భూకంపం సంభవించింది. ఇదిలాఉంటే.. టోంగా దీవుల్లో ఆదివారం ఉదయం వరుసగా 5.9 , 6.2 తీవ్రతతో రెండు భూకంపం సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
NCS ఇటీవల ఏప్రిల్‌లో సంభవించిన భూకంపాల నివేదికను విడుదల చేసింది. ఏప్రిల్ 1 నుండి 30వ తేదీ వరకు మొత్తం 81 భూకంపాలు నమోదయ్యాయని పేర్కొంది. వాటిలో 73 భూకంపాలు భారతదేశం మరియు దాని పొరుగు ప్రాంతంలో సంభవించాయని పేర్కొంది
ఇందులో అత్యధిక భూకంపాలు హిందూ కుష్ ప్రాంతం, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ మరియు కాశ్మీర్, ఉత్తరాఖండ్, అండమాన్ సముద్రం సహా అండమాన్ మరియు నికోబార్ దీవుల ప్రాంతంలో భూకంపాలు సంభవించినట్టు నివేదికలో పేర్కొంది.
హర్యానాలోని రోహ్‌తక్ , ఒడిషాలోని గంజాం , కర్ణాటకలోని బీజాపూర్, చిక్కబళ్లాపుర, ఆంధ్ర ప్రదేశ్‌లోని నెల్లూరు, కేరళలోని కొల్లాం, తమిళనాడులోని దిండిగల్ ల్లో చిన్నపాటి భూకంపాలు నమోదైనట్టు నివేదికలో పేర్కొంది.