శశిథరూరర్‌కు ఓటేసిన 1000 మంది బీజేపీలో చేరుతారన్న అసోం సీఎం.. థరూర్ ఏమన్నారంటే?

By Mahesh KFirst Published Nov 13, 2022, 12:58 AM IST
Highlights

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో శశిథరూర్‌కు ఓటేసిన 1000 మంది మాత్రమే ఆ పార్టీలో ప్రజాస్వామికవాదులు అని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. వారు ధైర్యం చూపి శశిథరూర్‌కు ఓటేశారని, త్వరలోనే వారు బీజేపీలో చేరుతారని ఊహిస్తున్నట్టు వివరించారు. ఆ ధైర్యవంతులు ఎప్పటికీ బీజేపీలో చేరబోరని, ధైర్యం లేనివారే బీజేపీలో చేరడానికి టెంప్ట్ అవుతారని శశిథరూర్ సమాధానం ఇచ్చారు.
 

న్యూఢిల్లీ: అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో శశిథరూర్‌కు ఓటేసిన సుమారు వేయి మంది కాంగ్రెస్ నేతలు త్వరలోనే బీజేపీలో చేరుతారని ఊహిస్తున్నట్టు తెలిపారు. దీనికి శశిథరూర్ వెంటనే సమాధానం ఇచ్చారు.

కాంగ్రెస్ వ్యవస్థాగత ఎన్నికల ఫలితాలు దాదాపు ఎన్నికకు ముందే ప్రకటించినట్టుగానే ఉన్నాయని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. ఓట్లను లెక్కించక ముందే విజేత ఎవరు అనేది దాదాపు అందరికీ స్పష్టంగానే తెలిసిపోయిందని వివరించారు. కానీ, ఆ ఎన్నికలో కేవలం వేయి మంది మాత్రమే ప్రజాస్వామిక వాదులు ఉన్నారని తెలిపారు. శశిథరూర్‌కు ఓటేసే తెగువను చూపినవారు ఈ ప్రజాస్వామికవాదులే అని చెప్పారు. ఆ 1000 మంది కాంగ్రెస్ ప్రతినిధులు త్వరలోనే బీజేపీలో చేరుతారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టు పేర్కొన్నారు.

Also Read:  ప్రమాదంలో ప్రజాస్వామ్యం.. రాజ్యాంగ వ్యవస్థలపై కేంద్రం దాడి : మల్లికార్జున్ ఖర్గే

ఈ కామెంట్లు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేశాయి. దీంతో తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ వెంటనే రియాక్ట్ అయ్యారు. ఓ వీడియోలో తన స్టేట్‌మెంట్ ఇలా ఇచ్చారు. తెగువను, ధైర్యాన్ని చూపించేవారూ ఎఫ్పటికీ బీజేపీలో చేరబోరని శశిథరూర్ రియాక్ట్ అయ్యారు. కేవలం ధైర్యం లేనివారు మాత్రమే బీజేపీలో చేరడానికి టెంప్ట్ అవుతారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్‌లు అభ్యర్థులుగా పోటీ పడ్డారు. ఇందులో మల్లికార్జున్ ఖర్గే విజయం సాధించారు. ఆయనకు 7,897 ఓట్లు పడ్డాయి. కాగా, శశిథరూర్‌కు 1,072 ఓట్లు పడ్డాయి. ఈ ఎన్నిక అక్టోబర్ 17న జరిగింది. అక్టోబర్ 19న మల్లికార్జున్ ఖర్గే గెలిచారని వెల్లడైంది. ఈ ఎన్నికలో విజయం సాధించిన మల్లికార్జున్ ఖర్గే ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతల్లో ఉన్నారు.

click me!