అసోం సీఎం హిమంత బిశ్వశర్మ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై సెటైరికల్ కామెంట్స్ చేశారు.
న్యూఢిల్లీ: భారత్ జోడో న్యాయ యాత్ర అసోం రాష్ట్రంలో సాగుతుంది. ఈ యాత్ర విషయమై అసోం సీఎం హిమంత బిశ్వశర్మపై రాహుల్ గాంధీ విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో తన యాత్రను అడ్డుకొనేందుకు హిమంత బిశ్వశర్మ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.ఈ ఆరోపణలను అసోం సీఎం బిశ్వ శర్మ ఖండించారు.
భారత్ న్యాయ యాత్రలో భాగంగా ఓ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం వీడియోపై అసోం సీఎం హిమంత బిశ్వశర్మ సోషల్ మీడియాలో సెటైరికల్ కామెంట్స్ చేశారు.
undefined
स्टोव पर कोयला???
आपके आलू से सोना बनाने वाली बात से हम उभर ही रहे थे की आपने स्टोव में कोयला डालकर हमे असमंजस में डाल दिया 🤔
आप होश मे तो हो? pic.twitter.com/cmTx4gM5gJ
ఉదయం లేవగానే టీ వేడి చేయడానికి స్టవ్ లో బొగ్గు పెట్టి కాల్చాలని వ్యాఖ్యానించారు. ఈ విషయమై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. పొయ్యి మీద బొగ్గు? బంగాళా దుంపల నుండి బంగారంగా మారుతుందనే మాటలను ఇప్పుడే సరిపెట్టుకుంటున్నామని ఆయన సెటైర్లు వేశారు. మీరు బొగ్గును పొయ్యిలో వేసి మమ్మల్ని గందరగోళానికి గురి చేశారని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ చెప్పారు.కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కూడ ఈ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఒక రోజు భారతదేశాన్ని నవ్వుతూ చంపేస్తాడని ఆయన సెటైర్లు వేశారు.
एक दिन यह आदमी हिंदुस्तान को हंसा हंसा के मार डालेगा।
😂😂 pic.twitter.com/hd2AKZNook