
ఉత్తరాఖండ్ ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా.. ఆదివారం cloudburst(అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షం, తుఫాను ) కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు కనిపించకుండా పోయారు. వారి ఆచూకీ కోసం అధికారులు గాలిస్తున్నారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తర కాశీ జిల్లా మాండూ గ్రామంలో.. క్లౌడ్ బస్ట్ కారణంగా ముగ్గురు చనిపోయారని అధికారులు చెప్పారు. కాగా.. నేడు కూడా ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
పశ్చిమ హిమాలయ ప్రాంతం (జమ్మూ, కాశ్మీర్, లడఖ్, గిల్గిట్, బాల్టిస్తాన్ మరియు ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్) ఆనుకొని ఉన్న వాయువ్య భారతదేశం (పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, నార్త్ మధ్యప్రదేశ్) కూడా భారీ వర్షాలకు భారీగా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా.. గత వారం ఈ భారీ వర్షాల కారణంగా పిడుగులు పడి.. పలు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పలు ప్రాంతాల్లో వరద ముప్పులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.