ఏషియానెట్ న్యూస్ సర్వే: యూపీ ఎన్నికలపై సాగు చట్టాల ప్రభావం ఎంత..?

By team teluguFirst Published Aug 18, 2021, 7:52 PM IST
Highlights

రానున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై వ్యవసాయ చట్టాల ప్రభావం ఎలా ఉండబోతుందో ఏషియానెట్ న్యూస్ మూడ్ ఆఫ్ ఓటర్స్ సర్వే ద్వారా తెలుసుకోండి

భారత దేశ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానిది ప్రత్యేక స్థానం. అలంటి ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు మరో 7 నెలల సమయం ఉండగానే ఇప్పటికే అక్కడి రాజకీయాలు వేడెక్కడమే కాకుండా యావత్ దేశం చూపును అటు తిప్పుకునేలా చేసాయి. 

2017 మాదిరిగా గెలిచి ఎలాగైనా అధికారాన్ని నిలుపుకోవాలని బీజేపీ చూస్తుంటే ప్రతిపక్షం ఏమో... బీజేపీని గద్దె దింపాలని పావులు కదుపుతుంది. ఈ నేపథ్యంలో అసలు ప్రజలు ఏమనుకుంటున్నారో, ప్రజల నాడి ఎలా వుందో తెలుసుకునే ప్రయత్నం చేసింది ఏషియానెట్ నెట్ న్యూస్ మూడ్ ఆఫ్ ఓటర్స్ సర్వే. జన్ కి బాత్ సంస్థతో చేపించిన సర్వేలో సాగు చట్టాలపై ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకుందాం. 

Also read: ఏషియానెట్ న్యూస్ సర్వే: యూపీలో విజేతను నిర్ణయించేది కుల సమీకరణలే....

దేశం మొత్తంలో నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలపై చర్చ నడుస్తుండగా ఇంకా ఉత్తరప్రదేశ్ లో మాత్రం ఇంకా ఒక ఏకాభిప్రాయం కనబడడం లేదు. పశ్చిమ ఉత్తరప్రదేశ్ లో మాత్రమే ఈ సాగు చట్టాల ప్రభావం కనబడుతుండగా... మిగిలిన ప్రాంతాల్లో అంత ప్రభావం కనబడడం లేదు. 

"

55 శాతం మంది ప్రజలు ఈ చట్టం మంచిదా, చెడ్డదా అని తేల్చుకోలేకపోతుండగా... 24 శాతం మంది ఈ చట్టం మేలు చేస్తున్నట్టు భావిస్తున్నారు. 21 శాతం మంది ప్రజలు మాత్రం సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. 40 శాతం మంది తాము ఈ సాగు చట్టాలను చదివి అర్థం చేసుకున్నట్టు చెబుతుండగా... 31 శాతం మంది ఈ చట్టం గురించి తెలియదన్నారు. 

ప్రాంతాలవారీగా గనుక చూసుకుంటే.... గోరఖ్ ప్రాంతంలో 51 శాతం మంది ప్రజలు తమకు ఈ సాగు చట్టాల గురించి తెలిఅయిదని చెప్పారు. 29 శాతం మంది ఈ సాగు చట్టాలను సమర్థించగా, 20 శాతం మంది వ్యతిరేకించారు. ఈ ప్రాంతంలో 48 శాతం మంది సాగు చట్టాలను అసలు చదవలేదనో, అవి అర్థం కాలేదనో చెప్పారు. 21 శాతం మంది చదివామని చెప్పగా... 31 శాతం మంది తెలియదు అని సమాధానం ఇచ్చారు. 

ఇక బ్రిజ్ ప్రాంతం విషయానికి వస్తే... .25 శాతం మంది ఈ సాగు చట్టాలను సమర్థించగా, 45 శాతం మంది వ్యతిరేకించారు. 30 శాతం మంది  చెప్పలేము అన్నారు. ఈ ప్రాంతంలో 44 శాతం మంది సాగు చట్టాలను చదివామని చెప్పగా... 31 శాతం మంది చదవలేదని చెప్పారు. మిగితా 25 శాతం మంది ఈ సాగు చట్టాల గురించి అసలు తెలియదు అని చెప్పారు. 

ఇక పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో... 18 శాతం మంది ఈ సాగు చట్టాలను సమర్థించగా, 63 శాతం మంది వ్యతిరేకించారు. 19 శాతం మంది  చెప్పలేము అన్నారు. ఈ ప్రాంతంలో 72 శాతం మంది సాగు చట్టాలను చదివామని చెప్పగా... 14 శాతం మంది చదవలేదని చెప్పారు. ఇంకో 14 శాతం మంది ఈ సాగు చట్టాల గురించి అసలు తెలియదు అని చెప్పారు. 

Also read: ఏషియానెట్ న్యూస్ సర్వే: తదుపరి ఉత్తరప్రదేశ్ సీఎం ఎవరు?

అవధ్ ప్రాంతంలో... 28 శాతం మంది ఈ సాగు చట్టాలను సమర్థించగా, 8 శాతం మంది వ్యతిరేకించారు. అత్యధికంగా 64 శాతం మంది  చెప్పలేము అన్నారు. ఈ ప్రాంతంలో 5 శాతం మంది సాగు చట్టాలను చదివామని చెప్పగా... 40 శాతం మంది చదవలేదని చెప్పారు. 55 శాతం మంది ఈ సాగు చట్టాల గురించి అసలు తెలియదు అని చెప్పారు. 

కాశీ ప్రాంతంలో... 21 శాతం మంది ఈ సాగు చట్టాలను సమర్థించగా, 31 శాతం మంది వ్యతిరేకించారు. 48 శాతం మంది  చెప్పలేము అన్నారు. ఈ ప్రాంతంలో 27 శాతం మంది సాగు చట్టాలను చదివామని చెప్పగా... 60 శాతం మంది చదవలేదని చెప్పారు. 13 శాతం మంది ఈ సాగు చట్టాల గురించి అసలు తెలియదు అని చెప్పారు. 

ఇక కాన్పూర్ బుందేల్ ఖండ్ ప్రాంతంలో 30 శాతం మంది ఈ సాగు చట్టాలను సమర్థించగా, 10 శాతం మంది వ్యతిరేకించారు. 60 శాతం మంది చెప్పలేము అన్నారు. సాగు చట్టాలను చదివి అర్థం చేసుకున్నారా అనే ప్రశ్నకు 50 శాతానికి ఎక్కువమంది సమాధానం ఇవ్వలేదు. 

ఉత్తరప్రదేశ్ లోని 6 భౌగోళిక ముఖ్య ప్రాంతాలైన కాన్పూర్ బుందేల్ ఖండ్, అవధ్, పశ్చిమ యూపీ, కాశి, బ్రిజ్, గోరఖ్ ప్రాంతాల్లో 4200 మంది ఓటర్లను శాంపిల్ తో ఈ ఒపీనియన్ సర్వేని నిర్వహించడం జరిగింది. రాండమ్ శాంప్లింగ్ ద్వారా వన్ ఆన్ వన్ ఇంట్రాక్షన్స్ తో ప్రాబబిలిటీ మ్యాపింగ్ ద్వారా ఈ సర్వే చేయడం జరిగింది.

click me!