ఏషియానెట్ న్యూస్ సర్వే: తదుపరి ఉత్తరప్రదేశ్ సీఎం ఎవరు?

By team teluguFirst Published Aug 18, 2021, 5:00 PM IST
Highlights

ముఖ్యమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరొక 7 నెలల సమయం మాత్రమే ఉంది. ఈసారి అక్కడి ఓటర్ల నాడిని తెలుసుకునేందుకు ఏషియా నెట్ న్యూస్ జన్ కి బాత్ తో యూపీ ఓటర్లు ఏమనుకుంటున్నారనే విషయాన్ని సర్వే చేయించింది. 

ఢిల్లీకి దారి ఉత్తరప్రదేశ్ నుండే అనేది అక్షర సత్యం. దేశంలో 2024లో ఎవరు అధికారంలోకి రావాలో డిసైడ్ చేసే రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ కి పేరుంది. అలాంటి ముఖ్యమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరొక 7 నెలల సమయం మాత్రమే ఉంది. ఈసారి అక్కడి ఓటర్ల నాడిని తెలుసుకునేందుకు ఏషియా నెట్ న్యూస్ జన్ కి బాత్ తో యూపీ ఓటర్లు ఏమనుకుంటున్నారనే విషయాన్ని సర్వే చేయించింది. 

ఇందులో కోవిడ్ మహమ్మారిని ప్రభుత్వం ఎలా ఎదుర్కొంది అనే విషయం మొదలు అయోధ్యలో రామమందిర నిర్మాణం వరకు జనాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపెట్టబోతున్నాయో ఏషియా నెట్ మూడ్ ఆఫ్ యూపీ సర్వే ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేసింది. 

ఉత్తరప్రదేశ్ లోని 6 భౌగోళిక ముఖ్య ప్రాంతాలైన కాన్పూర్ బుందేల్ ఖండ్, అవధ్, పశ్చిమ యూపీ, కాశి, బ్రిజ్, గోరఖ్ ప్రాంతాల్లో 4200 మంది ఓటర్లను శాంపిల్ తో ఈ ఒపీనియన్ సర్వేని నిర్వహించడం జరిగింది. రాండమ్ శాంప్లింగ్ ద్వారా వన్ ఆన్ వన్ ఇంట్రాక్షన్స్ తో ప్రాబబిలిటీ మ్యాపింగ్ ద్వారా ఈ సర్వే చేయడం జరిగింది. ఆ వివరాలు మీకోసం... 

ఈ సర్వేలో పాల్గొన్న అత్యధిక మంది ఓటర్లు యోగి ఆదిత్యనాథ్ కి రెండవ అవకాశాన్ని ఇవ్వడానికి మొగ్గుచూపుతున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో అక్రమార్కులపై ఉక్కుపాదం మోపడం, రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో సఫలీకృతం అవ్వడం కారణంగా చెబుతున్నారు. 

"

రామమందిర నిర్మాణం ప్రస్తుతానికి ఎన్నికలలో ప్రధాన అజెండాగా ఉన్నట్టు కనబడలేదు. కానీ ఇప్పుడిప్పుడే ప్రజలు ఆ విషయాన్నీ కూడా ఎన్నికల్లో ప్రధానాంశంగా భావించబోతున్నారనడానికి సంకేతాలయితే కనబడుతున్నాయి. 2022 ఎలక్షన్ నాటికి ఇది ప్రధాన అజెండాగా మారే సూచనలు కనబడుతున్నాయి. 

యోగి హయాంలో అవినీతి చాలా వరకు తగ్గిందని అత్యధికమంది ప్రజలు భావిస్తున్నారు. ఇది ఒకింత యోగి ఆదిత్యనాథ్ కి కలిసివచ్చే అంశం. అవాద్,పశ్చిమ,కాన్పూర్ బుందేల్ ఖండ్ ప్రాంతాల్లో అసలు దీన్ని ప్రధానమైన సమస్యగానే ప్రజలు పరిగణించడం లేదు. యోగి ఇమేజ్ క్లీన్ గా ఉన్నప్పటికీ... ఆయన కింద ఈ పథకాలను అమలు చేస్తున్న అధికారుల మీద మాత్రం అక్రమార్కులు, అవినీతిపరులు అనే ముద్ర ఉండడం గమనార్హం. ఓవరాల్ గా యోగి అవినీతిపరుడు కాదు కానీ... ఆయన కింద పనిచేస్తున్న అధికారులు అవినీతిపరులు అనే పరిస్థితి ప్రజల్లో నెలకొంది. 

Also Read: ఏషియానెట్ న్యూస్ సర్వే: వచ్చే యూపీ ఎన్నికల్లో రామమందిరం ప్రభావం ఎంత?

ఇక సాగు చట్టాల విషయానికి వస్తే దాని ప్రభావం పశ్చిమ ఉత్తరప్రదేశ్ కి మాత్రమే పరిమితమయింది. ఇక్కడొక ఆసక్తికర అంశం ఏమిటంటే... దాదాపుగా 50 శాతం మంది సాగు చట్టాలని చదవలేదని చెప్పగా... 58 శాతం మందికి సాగు చట్టాలపై ఎటువంటి అభిప్రాయం లేదు. ఎన్నికలకు ఇంకొక 7 నెలల సమయం ఉన్నందున వీటి ప్రభావం ఎలా ఉండబోతుందనేది ఇప్పుడే చెప్పలేము. 

ఇక విద్యుత్ చార్జీల పెరుగుదల ప్రభుత్వం పై ప్రతికూల ప్రభావం చూపే ఆస్కారం ఉందన్న సాధారణ మూడ్ కి వ్యతిరేకంగా 70 శాతం మంది ప్రజలు విద్యుత్ చార్జీలు పెద్దగా తమ మీద ప్రభావం చూపాయని చెప్పలేదు. 

ఇక అతి ముఖ్యమైన కుల సమీకరణాల విషయానికి వస్తే కాన్పూర్ బుందేల్ ఖండ్ ప్రాంతం మినహా మిగితా ప్రాంతాల్లోని బ్రాహ్మణులూ అత్యధికులు బీజేపీ వైపు మొగ్గు చూపారు. కాన్పూర్ బుందేల్ ఖండ్ ప్రాంతంలోని 36 శాతం మంది తమ మద్దతు ఎటు అనే విషయాన్నీ ఇంకా తేల్చుకోలేదని చెప్పారు. ఇక ఎస్సిల విషయానికి వస్తే జాటవ్, నాన్ జాటవ్ 

ల మధ్య చీలిక కనబడ్డప్పటికీ... అత్యధికులు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. 

Also Read: ఏషియానెట్ న్యూస్ సర్వే: యూపీలో విజేతను నిర్ణయించేది కుల సమీకరణలే....

అవినీతిని నిర్మూలించడంలో ప్రగతిని కొనసాగించడానికి, అక్రమార్కులకు అడ్డుకట్ట వేయడానికి, శాంతిభద్రతల విషయంలో రాష్ట్రం గతం కన్నా మెరుగ్గా ఉండాలని ప్రజలు కోరుకోవడం.... అన్ని పరిస్థితులను చూస్తే, కుల సమీకరణాలను కరెక్ట్ గా బేరీజు వేసుకొని టిక్కెట్లను గనుక అభ్యర్థులకు ఇస్తే, అత్యధిక నాన్ యాదవ్ ఓబీసీ ఓట్లు పాలైతే పరిస్థితులు యోగి ఆదిత్యనాథ్ కి అనుకూలంగా ఉండొచ్చని ప్రజలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. 

సర్వేలో పాల్గొన్న చాలా మంది అభ్యర్థులను మార్చాల్సిందిగా కోరారు. సిటింగ్ అభ్యర్థులను మార్చి కొత్త వారికి టికెట్లను ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ధరల పెరుగుదల ఎన్నికలపై ప్రభావం చూపెట్టే ఆస్కారం ఉన్నప్పటికీ.... శాంతిభద్రతల పరిరక్షణలో యోగి సర్కార్ పనితీరు భేష్ అని ప్రజలు కితాబిస్తున్న నేపథ్యంలో ఆ అంశం అంత ఎక్కువగా తెర మీదకు రాకపోవచ్చు. 

click me!