నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మహిళల ప్రవేశానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్:ఆర్మీపై సీరియస్ వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published Aug 18, 2021, 4:47 PM IST
Highlights

నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ప్రవేశం కోసం మహిళలు కూడా పరీక్షలు రాసేందుకు అనుమతించాలని సుప్రీంకోర్టు బుధవారం నాడు ఆదేశించింది. ఈ మేరకు ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. లింగ వివక్ష ఆధారంగా నిర్ణయాలు తీసకోవడం సరైంది కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.ఈ నిర్ణయంపై ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది.

న్యూఢిల్లీ:  నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్‌డీఏ)లో ప్రవేశం కోసం వచ్చే నెలలో జరిగే పరీక్షలకు మహిళలను అనుమతించాలని సుప్రీంకోర్టు బుధవారం నాడు చారిత్రక తీర్పును ఇచ్చింది.ఆర్మీ నిర్ణయాలు వివక్షకు కారణంగా ఉన్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వివక్షతో కూడిన నిర్ణయాలపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్్యక్తం చేసింది.

మహిళలను ఈ పరీక్షకు అనుమతించకూడదని ఆర్మీ తీసుకొన్న విధాన నిర్ణయం లింగవివక్షను  చూపుతుందన్నారు.ఈ ఏడాది సెప్టెంబర్ 5వ తేదీన నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్షలు జరగనున్నాయి.

న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, హృషికేశ్ రాయ్ ల ధర్మాసనం ఇవాళ మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. అడ్వకేట్ కుష్‌కల్రా దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. అర్హత ఉన్న మహిళా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతివ్వడంతో పాటు ఎన్డీఏలో శిక్షణ పొందేందుకు అవకాశం కల్పిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.

నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మహిళా అభ్యర్థులను వర్గీకరణపరంగా మినహాయించడం రాజ్యాంగపరంగా సమర్ధించదగింది కాదని పిటిషనర్ వాదించారు. ఆర్మీలో మహిళ అధికారులకు శాశ్వత కమిషన్, కమాండ్ పోస్టింగ్ లు మంజూరు చేయాలని సుప్రీంకోర్టు గత ఏడాది ఫిబ్రవరిలో ఇచ్చిన తీర్పును పిటిషనర్ ప్రస్తావించారు.

సాయుధ దళాల్లో మహిళలకు సమాన అవకాశం కల్పిస్తున్నామని కేంద్రం కోర్టుకు తెలిపింది. ఎలాంటి ప్రాథమిక హక్కును  ఉల్లంఘించలేదని కేంద్రం మంగళవారం నాడు కోర్టుకు తెలిపింది.విధాన నిర్ణయం ప్రకారమే మహిళలను ఈ పరీక్షలకు అనుమతించడం లేదని ఆర్మీ కోర్టుకు తెలపడంపై  ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.ఎన్‌డీఏ అనేది సాయుధ దళాల్లో నియామకాలకు సంబంధించిన వివిద పద్దతుల్లో ఒకటి,. 

click me!