ఒడిశా ఆరోగ్య మంత్రిని ఐదు సార్లు చంపేందుకు ప్రయత్నించిన ఏఎస్ఐ.. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి..

By team teluguFirst Published Feb 1, 2023, 2:08 PM IST
Highlights

ఒడిశా ఆరోగ్య మంత్రి హత్య కేసులో మరో కొత్త విషయం బయటకు వచ్చింది. మంత్రి నబా కిసోర్ దాస్ ను హత్య చేసేందుకు ముందు నిందితుడైన ఏఎస్ఐ పలు విషయాలను ఆరా తీశారని తెలుస్తోంది. మంత్రి ఇంటికి ఎప్పుడు వస్తారని ఐదు సార్లు కనుక్కున్నాడని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు. 

ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నబా కిసోర్ దాస్ హత్య కేసును విచారిస్తున్నక్రైమ్ బ్రాంచ్ పోలీసుల విచారణలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మంత్రిని కాల్చి చంపిన ఒడిశా పోలీసు అధికారి (ఏఎస్ఐ) గత 15 రోజుల్లో ఐదు పర్యాయాలు నబా దాస్‌ను చంపడానికి ప్రయత్నించారని క్రైమ్ బ్రాంచ్ అధికారులు మంగళవారం పేర్కొన్నారు.

పేగు సంబంధిత వ్యాధితో వస్తే.. అవయవాలు కొట్టేసి, ప్లాస్టిక్ కవర్లు కుక్కిన డాక్టర్లు.. మైనర్ బాలిక మృతి..

గత ఆదివారం ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నబా కిసోర్ దాస్ పై అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ గోపాల్ కృష్ణ దాస్ కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. మంత్రి ఛాతీపై రెండు బుల్లెట్లు దిగడంతో ఆయన తీవ్రంగా గాయపడి మరణించాడు. దీంతో ఏఎస్ఐ ను పోలీసులు అదుపులోకి తీసుకొని, విధుల నుంచి తొలగించారు. 

కాగా.. ఈ ఘటనపై ఒడిశా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే వారి దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్యలో నిందితుడైన గోపాల్ కృష్ణ దాస్.. జార్సుగూడలోని సర్బహల్‌లో ఉన్న ఇంట్లో మంత్రి ఉన్నారా లేదా అనే విషయాలను పలు మార్లు ఆరా తీశారని తెలిసింది. ఆయన ఐదు సార్లు ఇలా మంత్రి కోసం ఆరా తీశారని క్రైమ్ బ్రాంచ్ వెల్లడించింది. ‘‘ఐదు సందర్భాలలో మంత్రి తన ఇంటికి రాలేదు. ఆ సమయంలో ప్రతీ సారి ఏఎస్ఐ గోపాల్ కృష్ణ తన సర్వీస్ రివాల్వర్‌ని ధరించి ఉన్నాడు’’ అని ఓ క్రైమ్ బ్రాంచ్ అధికారి తెలిపినట్టు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఓ కథనంలో తెలిపింది.

కేంద్ర బ‌డ్జెట్ పై దేశ‌వ్యాప్తంగా బీజేపీ ప్ర‌చారం.. ప్ర‌త్యేక క‌మిటీ ఏర్పాటు: బీజేపీ చీఫ్ జేపీ న‌డ్డా

అయితే మంత్రి నబా దాస్ ఓ కార్యక్రమం కోసం బ్రజరాజ్‌నగర్‌ పర్యటనకు వెళ్లేందుకు రెండు రోజుల ముందే ఐఎస్ఐ దాని గురించి ఆరా తీశాడు. దీనిని బట్టి నిందితుడు మంత్రి హత్యకు పక్కాగా ప్లాన్ చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. కాగా.. తన బంధువుకు ఉద్యోగం ఇప్పించాలని ఏఎస్ఐ మంత్రిని కోరారని, కానీ మంత్రి దానికి నిరాకరించడంతో ప్రతీకార్య చర్యలో భాగంగా ఈ హత్య జరిగిందని అంతకు ముందు పోలీసులు వెల్లడించారు.

రైజింగ్ డే సందర్భంగా భారత తీర రక్షక దళానికి ప్రధాని మోడీ శుభాకాంక్షలు

కానీ హత్య తర్వాత గోపాల్ బైపోలార్ డిజార్డర్‌కు మందులు వాడుతున్నాడని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో అతడు మానసిక వ్యాధితో బాధపడుతున్నాడనే విషయం తెరపైకి తెలిపింది. అయితే అప్పటి వరకు కూడా ఏఎస్ఐ మానసిక స్థితి గురించి తమకు తెలియదని పోలీసు డిపార్ట్ మెంట్ వెల్లడించింది. కాగా.. బెర్హాన్‌పూర్‌లోని తన స్వగ్రామానికి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేయాలని కోరినా, అది చేయకపోవడంతో మంత్రిపై ఆయన కోపంగా ఉన్నాడని ఓ పోలీసు అధికారి తెలిపారు. 

click me!