విషాదం: ప్రియురాలి ఇంట్లో ప్రియుడు మృతి: మూడు మాసాలకే లవర్ సూసైడ్

Published : Jul 08, 2018, 03:36 PM IST
విషాదం:  ప్రియురాలి ఇంట్లో ప్రియుడు మృతి: మూడు మాసాలకే లవర్ సూసైడ్

సారాంశం

ప్రియుడి మృతిని తట్టుకోలేక ప్రియురాలు సూసైడ్ చేసుకొన్న ఘటన తమిళనాడు రాష్ట్రంలోని  తిరువొత్తియూరులో శుక్రవారం రాత్రి చోటు చేసుకొంది. ప్రియురాలు ఇంట్లో ఒంటరిగా ఉందని తెలుసుకొన్న ప్రియుడు ఆ ఇంటికి వెళ్లి మృతి చెందాడు.మనోవేదనకు గురైన లవర్ ఆత్మహత్య చేసుకొంది.


చెన్నై: ప్రియుడు మృతిని తట్టుకోలేక ప్రియురాలు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్న ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది. ప్రియుడు మృతి చెందిన రోజు నుండి ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది. ప్రియుడు మరణాన్ని భరించలేక ఆమె కూడ ఆత్మహత్య చేసుకొందని పోలీసులు తెలిపారు.

తమిళనాడు రాష్ట్రంలోని చెన్పై తిరువొత్తియూరులో  శుక్రవారం రాత్రి  ఆశ్విని అనే యువతి సూసైడ్ చేసుకొంది.  చెన్పైలోని గోపినగర్‌కు చెందిన నటరాజన్ లారీ ట్రాన్స్‌పోర్ట్‌ వ్యాపారం చేస్తున్నారు. అతని కుమార్తె ఆశ్విని.  ప్రస్తుతం ఆమె లా చేస్తోంది. 

కొంతకాలంగా ఆమె వేదారణ్యం శెట్టిపురానికి చెందిన తెన్నవన్‌కు ప్రేమిస్తోంది. ఈ ఏడాది మే 3వతేదీన నటరాజన్ కుటుంబసభ్యులు బంధువుల ఇంట్లో ఓ ఫంక్షన్‌లో పాల్గొనేందుకు వెళ్లారు. అయితే ఆ సమయంలో ఆశ్విని మాత్రం ఆ ఫంక్షన్‌కు వెళ్లలేదు.  

కానీ,  ఆ సమయంలోనే తెన్నవన్ ఆశ్విని ఇంటికి వచ్చాడు. అయితే  ఆశ్విని ఇంట్లోనే తెన్నవన్ గుండెపోటుతో మృతి చెందాడు.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దీంతో ఆశ్విని తీవ్ర మనస్థాపానికి గురైంది.

ఇల్లు మారితే మనసు కుదుట పడే అవకాశం ఉంటుందని ఆశ్వినిని కుటుంబసభ్యులు ఆమె పెదనాన్న ఇంటికి పంపించారు. మూడు నెలలుగా ఆశ్విని పెదనాన్న ఇంట్లోనే ఉంటోంది. శుక్రవారం రాత్రి పెదనాన్న కుటుంబసభ్యులు బయటకు వెళ్లిన సమయంలో ఆశ్విని ఒక్కతే ఇంట్లో ఉంది.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆశ్విని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

అయోధ్య రామమందిరానికి హై సెక్యూరిటీ.. ఎలాగో తెలుసా?
వెనిజులా తర్వాత ట్రంప్ టార్గెట్ ఈ దేశాలే..|Trump Next Target Which Country?| AsianetNewsTelugu