‘రాహుల్ గాంధీ ఎవరు?.. ఆయన నాకు తెలీదు..’ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు..

By SumaBala BukkaFirst Published Dec 4, 2021, 9:26 AM IST
Highlights

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఇతర రాష్ట్రాల్లో విస్తరించాలని చూస్తోందని ఓవైసీ తెలిపారు.  దాని వల్ల మరో రెండు మూడేళ్లలో దేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా లేకుండా కనుమరుగై పోతుందని అన్నారుఈ క్రమంలోనే రాహుల్ గాంధీ ఎవరు?  ఆయన తనకు తెలియదని ఓవైసీ ఎద్దేవా చేశారు. 

న్యూఢిల్లీ :  MIM అధినేత, హైదరాబాద్ ఎంపీ Asaduddin Owaisi కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. అజెండా ఆజ్ తక్ లో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో బీజేపీ నేత Sudhanshu Trivedi తో పాటు కలిసి పాల్గొన్నారు.  వీరిద్దరూ  ‘తమకు వ్యతిరేకంగా పోరాటం’ పేరుతో జరిగిన చర్చలో ఎవరు BJP లేదా Congressతో సెకండ్ గేమ్ ఆడుతున్నారు అన్న అంశంపై మాట్లాడారు.

అయితే ఈ సందర్భంగా ఓవైసీ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఇతర రాష్ట్రాల్లో విస్తరించాలని చూస్తోందని తెలిపారు.  దాని వల్ల మరో రెండు మూడేళ్లలో దేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా లేకుండా కనుమరుగై పోతుందని అన్నారు.

ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ ఎవరు?  ఆయన తనకు తెలియదని ఓవైసీ ఎద్దేవా చేశారు. మీకు తెలిస్తే తనకు తెలియజేయాలని వ్యాఖ్యాతను ఎదురు ప్రశ్నించారు.  తాము ప్రతి పార్టీకి B-Team Partyగా ఆరోపించబడుతున్నాం అని అన్నారు. అయితే రాహుల్ గాంధీని ఇక్కడికి పిలిచినా.. ఆయన కూడా బిజెపి వాళ్ళ మాటే మాట్లాడతాడు అన్నారు. ప్రస్తుతంటి టీఎంసీ పార్టీ  బి-టీం పార్టీగా మారిందని అన్నారు.

Congress Party తమను బిజెపి పార్టీ బి-టీం పార్టీ అంటుందని.. గోవాలో కాంగ్రెస్ ఎలా గెలుస్తుందో చూడాలని ఆసక్తిగా ఉందని తెలిపారు.  ఓవైసీ వ్యాఖ్యలపై బీజేపీ నేత  సుధాంశు త్రివేది మాట్లాడుతూ..  కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో  ఎంఐఎం  వంటి పార్టీ,  ఓవైసీ వంటి నేత ఎదగడానికి కాంగ్రెస్ సాయం చేసిందని కౌంటర్ ఇచ్చారు. 

ఇదిలా ఉండగా, నవంబర్ 26న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, బీజేపీ లపై విమర్శల వర్షం కురిపించారు. తనపై అన్ని పార్టీలు వరసగా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో.. అందరూ కలసి ఏకాభిప్రాయానికి రండి అంటూ ఆయన పేర్కొనడం గమనార్హం.

ఉత్తరప్రదేశ్ లో.. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా.. ఈ ఎన్నికల్లో.. పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ప్రకటించారు. అయితే.. ఆయన ప్రకటించిన నాటి నుంచి ఆయనపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో.. వాటిపై ఆయన స్పందించారు.

‘ఒవైసీ సమాజ్‌వాదీ ఏజెంట్ అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అనడం మీరు వినే ఉంటారు. ఒవైసీ బీజేపీ ఏజెంట్ అని ఎస్పీ అంటోంది. కాంగ్రెస్ నేను సో అండ్ సో ఈజ్ బీ టీమ్ అని.. విమర్శలు చేస్తున్నారని.. ముందు  నేను ఎవరి ఏజెంట్ అని నిర్ణయించుకోండి" అని ఒవైసీ విలేకరులతో మాట్లాడారు.

పెప్సికో కంపెనీకి చుక్కెదురు.. బంగాళాదుంప వెరైటీపై హక్కుల ఎత్తివేత

గత ఏడాది బీహార్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత మిస్టర్ ఒవైసీని ఓట్ కట్టర్‌గా అభివర్ణించింది కాంగ్రెస్. గణనీయమైన ముస్లిం జనాభా ఉన్న కీలకమైన సీమాంచల్ ప్రాంతంలో ఒవైసీ పార్టీ 20 మంది అభ్యర్థులను నిలబెట్టింది. ఆ పార్టీ ఐదు సీట్లు గెలుచుకుని ముస్లిం ఓట్లను చీల్చి, ఆ ప్రాంతాన్ని కైవసం చేసుకోవాలనే కాంగ్రెస్ ఆశలను తుంగలో తొక్కింది.

కాంగ్రెస్‌కు చెందిన రణ్‌దీప్ సూర్జేవాలా ఆయనను "బిజెపి ఏజెంట్" అని పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒవైసీని సమాజ్‌వాదీ పార్టీ ఏజెంట్‌గా అభివర్ణించారు. ఎస్పీ ఏజెంట్‌గా ఒవైసీ భావాలను రెచ్చగొడుతున్నారని అందరికీ తెలుసునని, అయితే ఇప్పుడు యూపీ అల్లర్లకు కాదు, అల్లర్లు లేని రాష్ట్రంగా గుర్తింపు పొందిందని ఆదిత్య నాథ్ పేర్కొన్నారు.

కాగా.. ప్రతి  ఒక్కరూ తనను ఆ పార్టీ ఏజెంట్... ఈ పార్టీ ఏజెంట్ అంటున్నారని.. అందరూ కూర్చొని.. తాను ఏ పార్టీ ఏజెంటో డిసైడ్ అవ్వండి అంటూ అసదుద్దీన్ కౌంటర్ ఇవ్వడం గమనార్హం. 

click me!