Same Sex Marriage: వివాహాన్ని కోర్టులు నిర్ణయించవు.. సుప్రీం తీర్పుపై ఒవైసీ కీలక వ్యాఖ్యలు..

Published : Oct 18, 2023, 06:12 AM IST
Same Sex Marriage: వివాహాన్ని కోర్టులు నిర్ణయించవు.. సుప్రీం తీర్పుపై ఒవైసీ కీలక వ్యాఖ్యలు..

సారాంశం

Same Sex Marriage: స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించలేమంటూ మంగళవారం సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ తీర్పుపై ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Same Sex Marriage: స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించలేమంటూ మంగళవారం సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటరీ ఆధిపత్య సూత్రాన్ని సుప్రీంకోర్టు సమర్థించిందని, అయినా ఏ చట్టం ప్రకారం ఎవరిని వివాహం చేసుకోవాలో అన్న విషయం కోర్టులు నిర్ణయించవని తన అభిప్రాయాలను వెల్లడించారు. 

AIMIM చీఫ్ ఇంకా మాట్లాడుతూ.. “నా విశ్వాసం, నా మనస్సాక్షి వివాహం అనేది ఒక స్త్రీ , పురుషుడి మధ్య మాత్రమే. ఇది 377 కేసు లాగా డీక్రిమినైజేషన్ ప్రశ్న కాదు, ఇది వివాహానికి సంబంధించిన గుర్తింపు. ప్రభుత్వం ఎవరిపైనా రుద్దలేదనేది నిజం.ఇలాంటి వివాహాలను ఇస్లాం గుర్తించదు. “  అని పేర్కొన్నారు. 

అసదుద్దీన్ ఒవైసీ పోస్ట్‌లో ఇలా రాశారు, “ప్రత్యేక వివాహ చట్టం, వ్యక్తిగత చట్టం ప్రకారం ట్రాన్స్‌జెండర్లు వివాహం చేసుకోవచ్చని బెంచ్ చేసిన వ్యాఖ్య పట్ల నేను ఆందోళన చెందుతున్నాను. ఇస్లాంకు సంబంధించినంత వరకు ఇది సరైన వివరణ కాదు. ఎందుకంటే.. ఇస్లాం ఇద్దరు జీవసంబంధమైన మగ లేదా ఇద్దరు జీవసంబంధమైన స్త్రీల మధ్య వివాహాన్ని గుర్తించదు. అని పేర్కొన్నారు. 

"ప్రత్యేక వివాహ చట్టంలోని లింగ-తటస్థ వివరణ కొన్నిసార్లు సమర్థించబడకపోవచ్చు. మహిళలకు అనాలోచిత దుర్బలత్వాలకు దారితీయవచ్చు. జస్టిస్ భట్‌తో నేను అంగీకరిస్తున్నాను" అని ఓవైసీ పేర్కొన్నారు.

స్వలింగ వివాహ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు

ఈ అంశంపై సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ప్రత్యేక వివాహ చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేయాలని పిటిషనర్లు డిమాండ్ చేశారు. స్వలింగ సంపర్కుల వివాహాన్ని గుర్తించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సుప్రీం కోర్టు ప్రకారం.. వివాహం కూడా ప్రాథమిక హక్కుల వర్గం వెలుపల పరిగణించబడుతుంది. స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని కోర్టు పేర్కొంది. ప్రభుత్వం కోరుకుంటే.. స్వలింగ సంపర్కుల ఆందోళనలను పరిశీలించడానికి ఒక కమిటీని వేయవచ్చని కోర్టు పేర్కొంది.
 

PREV
click me!

Recommended Stories

Codeine Syrup Case : అసెంబ్లీలో దద్దరిల్లిన దగ్గుమందు చర్చ
World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే