Owaisi on Maharashtra Political Crisis: "కోతులాట'ను తలపిస్తోంది".. 'మహా' సంక్షోభంపై Owaisi కీలక వ్యాఖ్యలు

By Rajesh KFirst Published Jun 25, 2022, 11:35 PM IST
Highlights

Owaisi on Maharashtra Political Crisis: మ‌హారాష్ట్ర‌లో నెల‌కొన్న రాజ‌కీయ సంక్షోభంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ త‌న‌దైన శైలిలో స్పందించారు. ఈ వ్య‌వ‌హారాన్ని చూస్తూంటే.. కోతులాటగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు కోతుల్లా ప్రవర్తిస్తూ ఒక కొమ్మ నుంచి మరో కొమ్మకు జంప్ చేస్తున్నారని అసదుద్దీన్ ఎద్దేవా చేశారు.
 

Owaisi on Maharashtra Political Crisis: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ఉత్కంఠ వీడ‌టం లేదు. శివ‌సేన ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే& కోం.. తిరుగుబాటుతో తలెత్తిన సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది. రెబ‌ల్ ఎమ్మెల్యేల‌ను ఒక్క‌చోట నుంచి మార్చుతూ.. క్యాంపు రాజ‌కీయాలు చేస్తున్నారు. ఈ రాజ‌కీయ సంక్షోభంపై   ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ త‌న‌దైన శైలిలో స్పందించారు. మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే.. 

మహారాష్ట్ర రాజ‌కీయ‌ పరిణామాలను చూస్తుంటే..  'కోతులాట'ను తలపిస్తోందని ఒవైసీ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు కోతుల్లా ప్ర‌వ‌ర్తిస్తూ.. ఒక కొమ్మ మీద నుంచి మరో కొమ్మ మీదకు దూకుతున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. ఈ సంక్షోభంపై మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం ఏం చేస్తుందో చేయనివ్వండనీ, ఎంఐఎం  మహారాష్ట్ర పరిణామాలపై ఓ కన్నేసి ఉంచింద‌ని ఒవైసీ వివరించారు. ఇది శివసేన అంతర్గత వ్యవహారమని, తాను కానీ, తన పార్టీ కానీ.. ఈ విషయంలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు.

మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే, ఏక్‌నాథ్ షిండే మధ్య జరిగిన పోరు ఇప్పుడు శివసేన అక్రమణగా దిశ‌గా సాగుతోంది. ఇప్పుడు రెండు వర్గాలు పార్టీ, గుర్తు, సిద్ధాంతాల‌పై వివాదం కొన‌సాగుతోంది. ఒకవైపు శివసేన తనదని, బాలాసాహెబ్ తనదని ఉద్ధవ్ ఠాక్రే చెబుతుంటే.. పార్టీపై తమ కూడా హక్కు ఉందని, సంఖ్యాబలం ఉద్ధవ్ దగ్గర కాదు, షిండే వర్గానికే  ఉంద‌ని షిండే వర్గం చెబుతోంది.

ఠాక్రేపై షిండే తిరుగుబాటు జెండా  

మహారాష్ట్రలో జూన్ 21న శివసేన నేత‌ ఏక్‌నాథ్ షిండే.. పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేల‌ను కూడ‌గ‌ట్టుకుని  ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. శివ‌సేన‌, ఎన్‌సిపి, కాంగ్రెస్‌ల అధికార మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) కూట‌మి నుండి శివసేన వీడిపోయాల‌ని తిరుగుబాటు దారుల ప్రధాన డిమాండ్. 

ఇదిలా ఉండగా.. ఏక్‌నాథ్ షిండేతో పాటు రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిప్యూటీ స్పీకర్‌కు రాసిన లేఖపై స్పీకర్ స్పందించారు. ఈ నేప‌ధ్యంలో మహారాష్ట్ర శాసనసభ కార్యదర్శి రెబల్ ఎమ్మెల్యేలకు తాజాగా నోటీసులు పంపారు. శివసేన పంపిన అనర్హత అభ్యర్థనపై జూన్ 27 లోపు స్పందించాలని రెబల్ ఎమ్మెల్యేలకు స్పష్టం చేసింది. 

మ‌రోవైపు.. ఈ సంక్షోభ స‌మ‌యంలో శివ‌సేన ఎమ్మెల్యే సంజయ్ రౌత్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తిరుగుబాటు చేస్తున్న ఎమ్మెల్యేల్లో ఎవరికి అయితే మంత్రి పదవులున్నాయో.. వారందరినీ 24 గంటల్లో మంత్రి పదవుల నుంచి తొలగిస్తామని సంజయ్ రౌత్ ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. 

ఈ క్ర‌మంలో శనివారం జరిగిన శివసేన జాతీయ కార్యవర్గ సమావేశంలో 3 తీర్మానాలను ఆమోదించారు. శివసేనలో అన్ని రకాల నిర్ణయాలు తీసుకునే హక్కులు పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రేకే ఉంటాయని అందులో పేర్కొన్నారు. బాలాసాహెబ్ ఠాక్రే, శివసేన పేర్లను మరెవరూ ఉపయోగించరాదని, పార్టీకి ద్రోహం చేసిన వారిపై చర్యలు తీసుకునే హక్కు ఉద్ధవ్ ఠాక్రేకు కూడా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే..
మూడో తీర్మానంలో శివసేనకు చెందిన 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ నోటీసులు పంపాల‌ని తీర్మానం చేశారు. 

click me!