Amit Shah : "దీదీని ఒప్పించే శక్తి నాకు లేదు": అమిత్ షా.. ఎందుకు ఇలా అన్నారు!?

By Rajesh KFirst Published Jun 25, 2022, 10:52 PM IST
Highlights

Amit Shah: పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ (Mamata Banerjee)ని ఒప్పించే శక్తి, సామర్థ్యాలు తనకు లేవని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు. ఆయ‌న 2002 గుజరాత్ అల్లర్ల (Gujarat Riots) కేసులో సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పును స్వాగతించారు.
 

Amit Shah: పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ (TMC) అధినేత్రి మమత బెనర్జీని ఒప్పించే శక్తి, సామర్థ్యాలు తనకు లేవని కేంద్ర హోం మంత్రి, బీజేపీ నేత అమిత్ షా (Amit Shah) అన్నారు. 2002 గుజరాత్ అల్లర్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వాగ‌తించారు. గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై  రాజకీయ ప్రేరేపిత ఆరోపణలు చేసిన వారు ఇప్పుడు క్షమాపణలు చెప్పాలని షా ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. అదే ఇంటర్వ్యూలో, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ఒప్పించడం తనకు సాధ్యం కాదని కూడా షా పేర్కొన్నారు. 

మ‌మ‌తా బెనర్జీ గురించి షా  ఇలా ఎందుకు అన్నాడో తెలుసుకుందాం..

ఇటీవలి కేంద్ర ప్ర‌భుత్వం రక్షణ దళాల్లో నియామకాల కోసం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా హింసాత్మక సంఘటనల గురించి అమిత్ షా ను ప్ర‌శ్నించ‌గా..  ఆయ‌న మాట్లాడుతూ..శాంతిభద్రతలను కాపాడటం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని చెప్పారు. అయితే అవసరమైనపుడు, రాష్ట్రాల దగ్గర తగిన వనరులు లేనపుడు కేంద్ర ప్రభుత్వాన్ని సహాయం కోరవచ్చునని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే వెంటనే కేంద్ర ప్రభుత్వం దళాలను పంపిస్తుందని చెప్పారు. 

మ‌మ‌తా బెనర్జీ వంటి ప్రతిపక్ష నాయకులు కేంద్ర దళాలు కేవలం కేంద్రం మాట మాత్రమే వింటాయని ఆరోపిస్తున్న విషయాన్ని ప్రస్తావించినపుడు అమిత్ షా మాట్లాడుతూ.. మమతా బెనర్జీని ఒప్పించే శక్తి మీడియాకు  గానీ, తన‌కు గానీ లేదని  సమాధానం ఇచ్చారు. రాజకీయ అభిప్రాయాలను వెల్లడించే  ప్రజాస్వామ్య హ‌క్కు ప్రతి ఒక్కరి ఉంటుంద‌ని ఆయన అన్నారు.  2021లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పటి నుండి, మమతా బెనర్జీతో బిజెపి అనేక సార్లు  విభేదాలు త‌ల్లెతాయి.  

ఇదిలా ఉండగా, ప్రధాని మోదీకి క్లీన్ చిట్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత.. షా తీస్తా సెతల్వాద్‌పై కూడా విమర్శలు గుప్పించారు . నేను తీర్పును చాలా జాగ్రత్తగా చదివాను. తీర్పులో తీస్తా సెతల్వాద్ పేరు స్పష్టంగా ఉంది. ఆమె నడుపుతున్న NGO - నాకు NGO పేరు గుర్తు లేదు - అల్లర్ల గురించి పోలీసులకు నిరాధారమైన సమాచారం ఇచ్చింది. ," అని అమిత్ షా ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. హింసాకాండలో మరణించిన కాంగ్రెస్ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీ భార్య జాకియా జాఫ్రీ చేసిన అప్పీల్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు శుక్రవారం అప్పీల్ “అర్హత లేనిది” అని పేర్కొంది.

click me!