కరోనాపైపోరులో ప్రధాని నరేంద్ర మోడీ సప్తపదులు ఇవే!

Published : Apr 14, 2020, 10:55 AM ISTUpdated : Apr 15, 2020, 06:47 AM IST
కరోనాపైపోరులో ప్రధాని నరేంద్ర మోడీ సప్తపదులు ఇవే!

సారాంశం

గతంలో విధించిన 21 రోజుల లాక్ డౌన్ ముగుస్తుండడంతో, ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి జాతి నుద్దేశించి ప్రసంగించారు. 

గతంలో విధించిన 21 రోజుల లాక్ డౌన్ ముగుస్తుండడంతో, ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి జాతి నుద్దేశించి ప్రసంగించారు. 

ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ రోజు మాటలాడుతూ, ప్రజలను ఈ కరోనా పై పోరులో తన తోడు రావాలని పిలుపునిచ్చారు.  కరోనా మహమ్మారిపై ఇన్ని రోజులు ప్రభుత్వానికి సహకరించిన ప్రజలు మరో ఏడూ సూత్రాలు పాటిస్తామని మాటివ్వాలని కోరారు.  

1. వయసు పైబడినవారిని కాపాడుకోవాలి. ఇంట్లోని వృద్దులపట్ల ప్రత్యేక శ్రద్ద చూపాలని,  గతంలో రోగాల బారిన పడిన హిస్టరీ ఉన్నా, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారికి కాపాడుకోవాలి. . 

2. లాక్ డౌన్, సోషల్ డిస్టెన్సింగ్ అనే లక్ష్మణ రేఖలను పాటించాలి. 

3. పేస్ మాస్కును ధరించాలి, దానికోసం ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, ఇంట్లో తయారుచేసిన ఫేస్ మాస్క్ లను వాడమని చెప్పారు. 

3. రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. 

4. కరోనా నియంత్రణకోసం రూపొందించిన ఆరోగ్య సేతు మొబైల్ యాప్ ని డౌన్ లోడ్ చేసుకోవాలని, ఇతరులను కూడా డౌన్ లోడ్ చేసుకునేందుకు ప్రోత్సహించాలని ప్రధాని పిలుపునిచ్చారు. 

 5. పేదలకు ప్రతిఒక్కరు ఈ సంకట సమయంలో చేతనైనంత సహాయం చేయాలనీ సూచించారు. 

6. సహ ఉద్యోగులపట్ల శ్రద్ద చూపడంతోపాటు, ఎవరిని కూడా ఉద్యోగాల నుంచి తీసేయవద్దు అని కోరారు. 

7. ప్రభుత్వ అధికారులను, పోలీసులను, వైద్య సిబ్బందిని గౌరవించాలని మోడీ కోరారు. 

ఈ సప్తపదిని పాటిస్తూ ప్రజలంతా ఈ కరోనా వైరస్ మహమ్మారిని పారద్రోలాలని, వీటిద్వారానే ఈ మహమ్మారి నుంచి మనం బయటపడవచ్చని మోడీ గారు తెలిపారు. 

 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం