AAP: డబుల్ ఇంజిన్ తుప్పుపట్టింది.. దేశానికి కొత్త ఇంజిన్ కావాలి.. బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు

By Mahesh RajamoniFirst Published Nov 25, 2022, 10:52 PM IST
Highlights

Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓ న్యూస్ ఛానెల్ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ.. బీజేపీ ఆదేశాల మేరకు సుకేష్ చంద్రశేఖర్ పని చేస్తున్నారని ఆరోపించారు. కాషాయ పార్టీ అతనిని జాతీయ అధ్యక్షుడిగా చేయాలంటూ ఆయ‌న వ్యాఖ్యానించారు. 
 

Delhi Chief Minister Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి ఆర‌వింద్ కేజ్రీవాల్ మ‌రోసారి బీజేపీపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఓ న్యూస్ ఛానెల్ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ.. బీజేపీ ఆదేశాల మేరకు సుకేష్ చంద్రశేఖర్ పని చేస్తున్నారని ఆరోపించారు. కాషాయ పార్టీ అతనిని జాతీయ అధ్యక్షుడిగా చేయాలంటూ ఆయ‌న వ్యాఖ్యానించారు. అలాగే, డబుల్ ఇంజన్ ప్రభుత్వం తుప్పు పట్టింది.. దేశానికి కొత్త ఇంజన్ కావాలని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దేశానికి ఇప్పుడు కొత్త ఇంజిన్ అవసరం ఉందని నొక్కి చెప్పారు.గుజరాత్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పోటీ చేస్తున్నవిషయాన్ని ప్రస్తావించిన ఆయన..  తమ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని బీజేపీ నమ్మకంతో ఉందీ, కానీ దేశానికి ఇప్పుడు కొత్త ఇంజిన్ అవసరం ఉంది.. ఎందుకంటే డ‌బుల్ ఇంజిన్ తుప్పుప‌ట్టింద‌ని అన్నారు.

దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో జరిగిన పంచాయితీ ఆజ్‌తక్ కార్యక్రమంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ  భార‌తీయ జ‌నతా పార్టీ (బీజేపీ) పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు సుకేష్ చంద్రశేఖర్ పంపిన లేఖల గురించి అడిగిన ప్రశ్నకు కేజ్రీవాల్ స్పందిస్తూ.. “ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌ను 15 ఏళ్లుగా బీజేపీ పాలిస్తోంది. 27 ఏళ్లుగా గుజరాత్‌ను పాలిస్తోంది. ఇన్నాళ్లూ వాళ్లు ఏం చేశారంటే, బీజేపీ దగ్గర సమాధానం లేదు.. అందుకే, మోసగాడు సుకేష్ చంద్రశేఖర్ ప్రేమ లేఖతో వచ్చారు. అంటూ విమ‌ర్శ‌ల దాడిచేశారు. అలాగే, బీజేపీ ట్యూన్ కు త‌గ్గ‌ట్టుగా సుకేష్ డాన్స్ చేస్తున్నాడంటూ ఆరోపించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ కోసం ప్రచారం చేయడానికి బీజేపీ తమ స్టార్ క్యాంపెయినర్‌గా అత‌న్ని గుజరాత్‌కు పంపాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'బీజేపీ పాటలకు సుకేష్ ఎలా డ్యాన్స్ చేస్తున్నారో చూస్తే బీజేపీ ఆయన్ను జాతీయ అధ్యక్షుడిగా చేయాలి' అని కేజ్రీవాల్ అన్నారు.

ఏ పార్టీ పేర్లు తీసుకోకుండా, దేశంలోని దుండగులు, నేరస్తులందరూ తమను తాము రక్షించుకోవడానికి ఒక పార్టీలోకి వెళతారనీ ఆరోపించిన కేజ్రీవాల్..  ఆ పార్టీ వారికి రక్షణ కల్పిస్తుందని హామీ ఇస్తుందని విమ‌ర్శించారు. ప్రస్తుతం సుకేష్ తనకు రక్షణ కల్పిస్తున్న పార్టీకి బ్యాటింగ్ చేయడం తప్ప మరేమీ చేయడం లేదని మండిప‌డ్డారు. మనీలాండరింగ్ కేసులో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న సత్యేందర్ జైన్ జైలు కాంప్లెక్స్ లోపల తనకు రక్షణ కల్పించేందుకు రూ.10 కోట్లు చెల్లించాలని కోరినట్లు కన్మాన్ సుకేష్ చంద్రశేఖర్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ రాశారు. దక్షిణ భారతదేశంలో పార్టీ పదవికి బదులుగా రూ. 50 కోట్లు చెల్లించాలనీ, దక్షిణాదిలో ఆప్ అవకాశాలను మరింత పెంచే వ్యక్తుల బృందాన్ని ఏర్పాటు చేయాలనీ ఆప్ త‌న‌ను కోరిందని కూడా ఆరోపించారు.

 

कनॉट प्लेस के सेंट्रल पार्क में आयोजित टाउनहॉल कार्यक्रम में दिल्ली नगर निगम चुनाव पर Aajtak के साथ बातचीत। LIVE https://t.co/0IVQAX6BA4

— Arvind Kejriwal (@ArvindKejriwal)

కాగా, గుజరాత్  

click me!