భార్యకు కరోనా: స్వీయ నిర్భంధంలోకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

Published : Apr 20, 2021, 02:34 PM ISTUpdated : Apr 20, 2021, 02:40 PM IST
భార్యకు కరోనా: స్వీయ నిర్భంధంలోకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

సారాంశం

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్వీయ నిర్భంధంలోకి వెళ్లాడు. కేజ్రీవాల్ సతీమణి సునీతకు కరోనా సోకింది.  ఈ విషయం మంగళవారం నాడు నిర్ధారణ అయింది. దీంతో సీఎం క్వారంటైన్ లోకి వెళ్లాడు.

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్వీయ నిర్భంధంలోకి వెళ్లాడు. కేజ్రీవాల్ సతీమణి సునీతకు కరోనా సోకింది.  ఈ విషయం మంగళవారం నాడు నిర్ధారణ అయింది. దీంతో సీఎం క్వారంటైన్ లోకి వెళ్లాడు.మంగళవారం నాడు నిర్వహించిన పరీక్షల్లో సునీతకు కరోనా సోకినట్టుగా తేలిందని అధికారులు ప్రకటించారు. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడలేదు.

2020 జూన్ మాసంలో అరవింద్ కేజ్రీవాల్ క్వారంటైన్ లోకి వెళ్లాడు.  ఆ సమయంలో జ్వరం , గొంతునొప్పితో బాధపడుతున్న సమయంలో ఆయన పరీక్షలు చేయించుకొన్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా సోకిందని తేలింది. కొంత కాలం పాటు ఆయన హోం క్వారంటైన్ లో ఉన్నాడు. ఆ తర్వాత ఆయన  కరోనా నుండి కోలుకొన్నారు. 

సోమవారం నాడు ఢిల్లీలో 23,686 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో 240 మంది మరణించారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య ఇటీవల కాలంలో ఇదే ప్రథమంగా రికార్డులు చెబుతున్నాయి.కరోనా కేసుల వ్యాప్తిని నిరోధించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల పాటు  ఢిల్లీలో లాక్‌డౌన్ విధించింది.


 

PREV
click me!

Recommended Stories

భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu
PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu