టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: అమిత్ షాను అరెస్టు చేయాలి.. ఢిల్లీలోనూ కుట్ర జరిగింది: ఢిల్లీ డిప్యూటీ సీఎం

Published : Oct 29, 2022, 05:46 PM ISTUpdated : Oct 29, 2022, 05:52 PM IST
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: అమిత్ షాను అరెస్టు చేయాలి.. ఢిల్లీలోనూ కుట్ర జరిగింది: ఢిల్లీ డిప్యూటీ సీఎం

సారాంశం

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమిత్ షాను అరెస్టు చేయాలని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా డిమాండ్ చేశారు. లీకైన ఆడియో టేపుల్లో ఢిల్లీలోనూ ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలనే కుట్ర జరిగినట్టు చర్చించారని వివరించారు.  

న్యూఢిల్లీ: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నది. లీకైన ఆడియో రికార్డుల్లో ఇతర రాష్ట్రాల్లోనూ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను ప్రస్తావించడంతో ఈ వ్యవహారం పరిమాణం విస్తరించింది. లీకైన ఆడియో టేపుల్లో ఢిల్లీలోనూ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు చేసినట్టు మధ్యవర్తులు పేర్కొన్నారు. బీజేపీలోకి వారిని తీసుకురావాలని ప్రయత్నించినట్టు వివరించారు. దీంతో ఈ వ్యవహారం మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తుండగా తాజాగా రాష్ట్ర పరిధిని దాటేసింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సైతం ఈ ఆడియో టేపులను నిజమైనవనే పరిగణిస్తూ ఢిల్లీలోనూ ఇలాంటి కుట్రలు జరిగినట్టు పేర్కొన్నారు. ఈ ఆడియో రికార్డుల్లోనూ తాము చెప్పిన విషయం ధ్రువపడ్డదని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలకు డబ్బులతో ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బీజేపీపై విమర్శలు చేసింది. డబ్బు లంచంగా చూపి పార్టీ ఫిరాయించే పని చేసిందని ఆరోపించారు. ఈ ఆపరేషన్ లోటస్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రమేయం ఇందులో ఉంటే వెంటనే ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొట్టాలనే ఆపరేషన్‌లో కేంద్ర హోం మంత్రి ప్రమేయం కూడా ఉంటే వెంటనే ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Also Read: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. రిమాండ్ రిపోర్ట్ లో సీక్రెట్ ఆపరేషన్ జరిగిన తీరును వివరించిన పోలీసులు

ఢిల్లీ, పంజాబ్, మరో ఎనిమిది రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను బీజేపీలోకి రప్పించుకోవడానికి అక్రమ ప్రణాళికలకు బీజేపీ పాల్పడిందని ఆప్ విమర్శించింది. బీజేపీ దుష్ట క్రీడ మరోసారి బయటపడిందని, ఈ సారి తెలంగాణలో వెలుగులోకి వచ్చిందని మనీష్ సిసోడియా అన్నారు. బీజేపీలో చేర్చుకోవడానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు లంచం ఇచ్చే ప్రయత్నాలు చేసిన ముగ్గురు మధ్యవర్తుల మధ్య జరిగిన సంభాషణలో షా పేరు వచ్చిందని అన్నారు. ఇక్కడ షా అంటే.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేరే అని స్పష్టమైతే ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఒక బ్రోకర్ ఒక ఎమ్మెల్యేలను కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తుండగా దొరికినప్పుడు అందలోననూ కేంద్ర హోం శాఖ బాధ్యుడి పేరు ఇందులో వచ్చిందని, ఇది యావత్ దేశానికే తీవ్రమైన ముప్పు అని పేర్కొన్నారు.

‘ఈ రోజు మరో కొత్త ఆడియో బయటకు వచ్చింది. తెలంగాణ ఎమ్మెల్యలేకు,బీజేపీ దళారులకు మధ్య జరిగిన సంభాషణ ఇది. ఈ ఆడియో క్లిప్‌లో మధ్య వర్తి ఒక విషయాన్ని రివీల్ చేశాడు. ఢిల్లీలోనూ తాము ఈ ప్రయత్నం చేసినట్టు వివరించారు. ఢిల్లీలో 43 మంది ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీలోకి చేర్పించే ప్రయత్నం చేశాడని రికార్డులు వివరిస్తున్నాయని మనీష్ సిసోడియా అన్నారు.

Also Read: మొయినాబాద్ ఫామ్ హౌస్‌ కేసు.. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఏసీబీ కోర్టుకు తరలింపు..

‘ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి మీరు రూ. 1,075 కోట్లు ఎలా అరేంజ్ చేసుకున్నారు? ఈ డబ్బు అంతా ఎవరిది? ఎక్కడి నుంచి వస్తున్నది? అంటూ అడిగారు. ఈ ఎపిసోడ్ మొత్తాన్ని సమగ్రంగా దర్యాప్తు చేయేలని ఆయన డిమాండ్ చేశారు. ఈడీ రంగంలోకి దిగి అసలు విషయాలను దర్యాప్తు చేయాలని కోరారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu