జమ్మూ సుంజావన్ మిలటరీ స్టేషన్ వద్ద మరో డ్రోన్.. !

Published : Jun 29, 2021, 09:59 AM IST
జమ్మూ సుంజావన్ మిలటరీ స్టేషన్ వద్ద మరో డ్రోన్.. !

సారాంశం

జమ్మూలోని సుంజావన్ మిలటరీ స్టేషన్ దగ్గర మంగళవారం మరో డ్రోన్ ను సైనికులు గుర్తించారు. మిలటరీ స్టేషన్ లక్ష్యంగా చేసుకుని డ్రోన్ వదలినట్టు ఆర్మీ గుర్తించింది. గత మూడు రోజులు నుంచి కుంజావని, సుంజావన్, కాలుచెక్ల దగ్గర మొత్తం ఐదు డ్రోన్లను సైనికులు కనుగొన్నారు. 

జమ్మూ నగరానికి సాత్వారి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు కుంజావని, సుంజావన్, కాలుచెక్ అతి సమీపంలో ఉన్నాయి. మూడు రోజుల్లో మిలటరీ కేంద్రాల వద్ద డ్రోన్లు లభించడంతో సైనికులు అప్రమత్తమయ్యారు. 

జమ్మూలోని కాలుచెక్ వద్ద సోమవారం ఉదయం 68వ ఆర్మీ బ్రిగేడ్ కు చెందిన సెంట్రీ ఒక డ్రోన్ ను గుర్తించారు. వెంటనే చర్యలు చేపట్టిన సైన్యం డ్రోన్ ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపింది. కానీ లక్ష్యాన్ని చేధించలేకపోయింది. 
 
PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?