ఇండియాలో కరోనా తగ్గుముఖం: వెయ్యిలోపు మరణాలు, 37 వేల కేసులు

Published : Jun 29, 2021, 09:43 AM IST
ఇండియాలో కరోనా తగ్గుముఖం: వెయ్యిలోపు మరణాలు, 37 వేల కేసులు

సారాంశం

ఇండియాలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 37,037 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో  907 మంది కరోనాతో మరణించారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 30,316,000కి చేరుకొన్నాయి. కరోనాతో మరణించిన వారి సంఖ్య 397,668కి చేరింది.  


న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 37,037 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో  907 మంది కరోనాతో మరణించారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 30,316,000కి చేరుకొన్నాయి. కరోనాతో మరణించిన వారి సంఖ్య 397,668కి చేరింది.

కేరళలో 8,063, మహారాష్ట్రలో 6,727, తమిళనాడులో4,904, ఆంధ్రప్రదేశ్ లో 2,224, కర్ణాటకలో 2,576, ఢిల్లీలో 59 , పశ్చిమబెంగాల్ లో 1,836 కరోనా కేసులు నమోదయ్యాయి.మహరాష్ట్రలో ఇప్పటివరకు 6,043,548, కేరళలో 2,896,957,కర్ణాటకలో 2,837,206,తమిళనాడులో 2,470,670, ఆంధ్రప్రదేశ్ లో 1,882,096 కరోనా కేసులు నమోదైనట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది..

దేశంలో ఇప్పటివరకు కరోనా నుండి 29,366,601 మంది కోలుకొన్నారు. కరోనా రికవరీ రేటు 99 శాతానికి చేరింది. కరోనా మృతుల సంఖ్య 1 శాతంగా ఉందని  కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.దేశంలోని పలు రాష్ట్రాల్లో అన్‌లాక్ ప్రక్రియ కొనసాగుతోంది. అన్ లాక్ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. డెల్టా ప్లస్ వేరియంట్ పట్ల కూడ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆయా రాష్ట్రాలను కోరింది.

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు