శుభకార్యానికి వెళుతూ... లోయలో పడిన వాహనం, 10మంది మృతి

Published : Jun 29, 2021, 08:22 AM ISTUpdated : Jun 29, 2021, 08:34 AM IST
శుభకార్యానికి వెళుతూ... లోయలో పడిన వాహనం, 10మంది మృతి

సారాంశం

 ప్రమాదం జరిగిన సమయంలో కారులో 12మంది ఉన్నట్లు తెలుస్తోంది. తొలుత 9మంది శరీరాలను బయటకు తీశారు. ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు గుర్తించారు.

శుభకార్యానికి వెళుతున్న వాహనం.. ప్రమాదానికి గురైంది. వాహనం అదుపుతప్పి లోయలో పడిపోవడంతో.. దాదాపు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్ లోని సిర్మూర్ జిల్లాలో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. వివాహానికి వెళ్లి వస్తున్న ఓ కారు షిల్లైలోని పాశోగ్​ లోయలో పడింది. ఈ ఘటనలో 10 మంది చనిపోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇంకా మృతదేహాలను గుర్తించలేదని పోలీసులు తెలిపారు. 

కాగా..  ప్రమాదం జరిగిన సమయంలో కారులో 12మంది ఉన్నట్లు తెలుస్తోంది. తొలుత 9మంది శరీరాలను బయటకు తీశారు. ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు గుర్తించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించేలోపు.. వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. ప్రమాదం ఎలా జరిగింది అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. సహాయక చర్యలు ఇంకా కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

కాగా.. ఈ రోడ్డు ప్రమాదం పై హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరాం థాకూర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మంచి వైద్యం అందించాలని సూచించారు. 

PREV
click me!

Recommended Stories

ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్
భార‌త్‌లో ల‌క్ష‌ల కోట్ల పెట్టుబడులు పెడుతోన్న అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌.. భ‌విష్య‌త్తులో ఏం జ‌ర‌గ‌నుందంటే?