Agniveer Recruitment: అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్మీ..

Published : Jun 20, 2022, 02:21 PM ISTUpdated : Jun 20, 2022, 02:44 PM IST
Agniveer Recruitment: అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్మీ..

సారాంశం

త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ స్కీమ్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అగ్నిపథ్ స్కీమ్‌పై ఓవైపు ఆందోళనలు కొనసాగుతుండగానే.. మరోవైపు ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ స్కీమ్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో..  కేంద్రం కొన్ని సడలింపులను కూడా ప్రకటించింది. అగ్నిపథ్ స్కీమ్‌పై ఓవైపు ఆందోళనలు కొనసాగుతుండగానే.. మరోవైపు ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై నుంచి ప్రారంభం కానుంది. ఇండియన్ ఆర్మీ నేడు విడుదల చేసిన నోటిఫికేషన్‌లో.. అగ్నివీర్ పథకానికి సంబంధించిన సేవా నిబంధనలు, షరతులు, అర్హత, డిశ్చార్జ్, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని వివరించింది. ఇక, అగ్నిపథ్ స్కీమ్ కింద త్రివిధ దళాల్లో తొలుత అగ్నివీరుల ఎంపికకు నోటిఫికేషన్ జారీచేసింది ఇండియన్ ఆర్మీనే. 

భారత సైన్యంలో స్వల్పకాలిక నియామకాల కోసం అగ్నిపథ్ స్కీమ్‌ను కేంద్రం తీసుకొచ్చింది. కేంద్ర మంత్రివర్గం జూన్ 14న అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌కు ఆమోదించింది మరియు ఈ పథకం కింద ఎంపికైన యువతను అగ్నివీర్స్ అని పిలుస్తారు. శిక్షణ కాలంతో సహా 4 సంవత్సరాల సేవా వ్యవధి కోసం అగ్నివీర్‌లను ఎంపిక చేస్తారు. నాలుగేళ్ల తర్వాత.. మెరిట్, సుముఖత, మెడికల్ ఫిట్‌నెస్ ఆధారంగా 25 శాతం మంది అగ్నివీర్లను మాత్రమే రెగ్యులర్ కేడర్‌లో ఉంచుతారు. వీరు 15 ఏండ్ల పాటు నాన్ ఆఫీసర్ ర్యాంక్స్‌లో పనిచేసే అవకాశం ఉంటుంది. మిగిలిన 75శాతం మందికి ఎగ్జిట్ అవకాశం కల్పిస్తారు. ఎగ్జిట్ సమయంలో రూ.11 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు సేవా నిధి ప్యాకేజ్, స్కిల్ సర్టిఫికేట్ ఇస్తారు. కానీ పెన్షన్ బెనిఫిట్స్ ఏమీ ఉండవు. అయితే వ్యాపారాలు చేసుకోవాలనుకునే వారికి బ్యాంకుల నుంచి లోన్లు సులువుగా లభిస్తాయి. 
 

PREV
click me!

Recommended Stories

ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్
భార‌త్‌లో ల‌క్ష‌ల కోట్ల పెట్టుబడులు పెడుతోన్న అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌.. భ‌విష్య‌త్తులో ఏం జ‌ర‌గ‌నుందంటే?