army Helicopter Crash : రేపు పార్లమెంట్‌లో ప్రకటన చేయనున్న రాజ్‌నాథ్ సింగ్, దేశ ప్రజల్లో ఉత్కంఠ

By Siva KodatiFirst Published Dec 8, 2021, 4:43 PM IST
Highlights

చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ (cds bipin rawat ) ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్‌ కూలిన (army Helicopter Crash) ఘటనపై కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంట్‌లో ప్రకటన చేయనుంది.

చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ (cds bipin rawat ) ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్‌ కూలిన (army Helicopter Crash) ఘటనపై కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంట్‌లో ప్రకటన చేయనుంది. కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (rajnath singh) రేపు పార్లమెంట్‌లో ఈ మేరకు ప్రకటన చేస్తారని భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఘటన అనంతర పరిస్థితులను రాజ్‌నాథ్ స్వయంగా సమీక్షిస్తున్నారు. ఇప్పటికే కేబినెట్ (union cabinet) అత్యవసర సమావేశంలో ప్రధాని మోడీకి వివరాలు తెలియజేసిన ఆయన.. కొద్ది సేపటి క్రితం ఢిల్లీలోని రావత్‌ నివాసానికి కూడా వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సాయంత్రం రాజ్‌నాథ్ సింగ్ ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 

కాగా.. భారతదేశ తొలి డిఫెన్స్ స్టాఫ్ చీఫ్‌గా బిపిన్ రావత్ 2019, జ‌న‌వ‌రిలో బాధ్య‌త‌లు స్వీక‌రించారు. త్రివిధ దళాల (వాయుసే, ఆర్మీ, నౌకాద‌ళం) తొలి అధిపతిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన బిపిన్ రావ‌త్ మూడేళ్ల పాటు ఈ ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నారు. ఇక ఆయ‌న ప‌ద‌వీకాలం 2022, జ‌న‌వ‌రితో ముగియ‌నుంది. అంత‌లోనే ఈ దుర్ఘటనన జ‌ర‌గ‌డంతో భారత సాయుధ దళాలు ఉలిక్కిపడ్డాయి.  గతంలో మూడేళ్లపాటు ఆర్మీ చీఫ్‌గా పని చేసిన బిపిన్ రావత్.. 2019, జ‌న‌వ‌రిలో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అంతకు ముందే ఆయన్ను దేశ తొలి డిఫెన్స్ స్టాఫ్ చీఫ్‌గా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 

ALso REad:Bipin Rawat: బిపిన్ రావత్ కండీషన్ సీరియస్..! త్వ‌ర‌లో కేంద్ర‌మంత్రి ప్రకటన!

త్రివిధ దళాలకు చెందిన చిహ్నాలను ఆయన యూనిఫాం మీద పొందుపరిచారు. మిలిటరీ వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తూ... రక్షణ మంత్రికి ప్రిన్సిపల్ మిలిటరీ అడ్వైజర్‌గా సీడీఎస్ వ్యవహరిస్తున్నారు. అంతేకాదు మనదేశంలో అత్యంత శక్తివంతమైన సైనికాధికారి ఆయనే.. లఢఖ్ సంక్షోభ సమయంలో బిపిన్ రావత్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. అంతేకాదు భారత రక్షణ రంగంలో అతిపెద్ద సంస్కరణలకు రావత్ మార్గదర్శి.. దేశంలో త్రివిధ దళాలకు వేర్వేరు చోట్ల వున్న 17 కమాండ్లను కలిపి ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్లుగా ఏర్పాటు చేసే అత్యంత కీలకమైన బాధ్యత ఆయనదే. 

మరోవైపు తమిళనాడు (tamilnadu) రాష్ట్రం కొయంబత్తూర్‌, కూనూరు మధ్యలో బుధవారం ఈ చాపర్ ప్రమాదం చోటుచేసుకుంది. హెలికాప్టర్‌లో బిపిన్‌ రావత్‌తో పాటు, ఆయన సిబ్బంది, కొందరు కుటుంబసభ్యులు కలిసి మొత్తం 14 మంది ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారమందుకున్న ఆర్మీ, పోలీస్, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. విల్లింగ్టన్‌ ఆర్మీ కేంద్రం నుంచి బయల్దేరిన ఈ ఎంఐ సిరీస్‌ హెలికాప్టర్‌.. కాసేపటికే కుప్పకూలినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ముగ్గుర్ని రక్షించి ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదాన్ని భారత వాయుసేన కూడా ధ్రువీకరించింది. దీనిపై విచారణకు ఆదేశించినట్లు తెలిపింది. 

click me!