Priyanka Gandhi : ఉద్యోగాల్లో మహిళలకు 40 శాతం రిజర్వేషన్..

By Mahesh RajamoniFirst Published Dec 8, 2021, 4:35 PM IST
Highlights

Priyanka Gandhi :  వచ్చే ఏడాది ప్రారంభంలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఇప్ప‌టికే ఎల‌క్ష‌న్ హీట్ మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో యూపీలో కాంగ్రెస్ ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేసింది. మ‌హిళా సాధికార‌త‌ను మాట‌ల్లో కాకుండా చేత‌ల్లో చూపుతామ‌ని కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ స్ప‌ష్టం చేస్తూ.. బుధ‌వారం మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేక మేనిఫెస్టోను విడుద‌ల చేశారు. 

Priyanka Gandhi : వచ్చే ఏడాది ప్రారంభంలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ (Assembly Elections) ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఒక‌టి. ఈ నేప‌థ్యంలోనే అక్క‌డ ఎలాగైనా అధికారం ద‌క్కించుకోవాల‌ని ప్ర‌ధాన పార్టీల‌న్ని ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేశాయి. జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల‌ని కాంగ్రెస్ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ.. ప్ర‌చారంలో భాగంగా హామీలు, స‌రికొత్త ప‌థ‌కాలను ప్ర‌క‌టిస్తూ దూసుకుపోతున్నారు. బుధ‌వారం నాడు మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేకంగా రూపొందించిన కాంగ్రెస్ ఎన్నిక‌ల మేనిఫెస్టోను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. మ‌హిళా సాధికార‌త‌ను మాట‌ల్లో కాకుండా చేత‌ల్లో చూపుతామ‌ని అన్నారు.  యూపీలో తాము అధికారంలోకి వ‌స్తే ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో మ‌హిళ‌ల‌కు 40 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తామ‌ని ప్ర‌క‌టించారు.  అలాగే, మ‌హిళ‌లు రాజ‌కీయాల్లో పాలుపంచుకుంటే మ‌హిళా సాధికారత కాగితాల‌కు ప‌రిమితం కాకుండా సాకారం అవుతుంద‌ని అన్నారు.

Also Read: Sonia Gandhi : కేంద్ర‌పై నిప్పులు చెరిగిన సోనియా.. రైతు మ‌ద్ద‌తుకు క‌ట్టుబ‌డి ఉన్నాం..

 వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు  ప్రియాంక గాంధీ తీవ్రంగా శ్రమిస్తున్నారు.ఇదివ‌ర‌కే ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ మ‌హిళ‌ల‌కు అధిక స్థానాలు కేటాయిస్తామ‌ని ప్ర‌క‌టించిన ఆమె.. బుధ‌వారం నాడు యూపీ వుమెన్స్ మేనిఫెస్టో అంటూ  యూపీ ఎన్నిక‌ల కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజ‌యం సాధిస్తే.. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 40 శాతం రిజ‌ర్వేష‌న్ కల్పిస్తామని Priyanka Gandhi అన్నారు. అన్ని విధాల రాష్ట్ర అభివృద్ధికి ఈ మేనిఫెస్టో ఒక రోడ్ మ్యాప్ అని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు 40 శాతం టిక్కెట్లు ఇస్తామ‌ని తెలిపారు.  అలాగే, తాము అధికారంలోని వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలోని 25 నగరాల్లో హాస్టళ్లను నిర్మిస్తుందని, బాలికల కోసం సాయంత్రం పాఠశాలలను తెరుస్తుందని ప్రియాంక అన్నారు. గ్రాడ్యుయేట్‌ బాలికలకు స్కూటీలు, 12వ తరగతి పాసైన బాలికలకు స్మార్ట్‌ఫోన్లు అందజేస్తామని ఆమె  తెలిపారు.అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తే రైతు రుణాలు మాఫీ చేస్తామని వెల్ల‌డించారు.

Also Read: Vizag steel plant protest : విశాఖ ఉక్కు ఉద్యమానికి 300 రోజులు.. నేడు భారీ ధర్నా

అలాగే, కాంగ్రెస్ పార్టీ మ‌హిళ‌ల‌కు ప్రాధాన్య‌త క‌ల్పిస్తున్న విష‌యాల‌ను సైతం Priyanka Gandhi ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు. దేశానికి  తొలి మ‌హిళా ప్ర‌ధాన‌మంత్రిని కాంగ్రెస్ అందించింద‌న్నారు.  దేశంలో తొలి మ‌హిళా సీఎంగా కాంగ్రెస్‌కు చెందిన సుచేత కృప‌లానీ అధికార ప‌గ్గాలు చేప‌ట్టార‌ని తెలిపారు.  వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలోనే యూపీ ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశాలున్నాయి. దీంతో అన్ని పార్టీలు ప్రచారంలో వేగం పెంచాయి. పొత్తుల కోసం సైతం సంప్ర‌దింపుల‌ను వేగ‌వంతం చేశాయి. ఇదే స‌మ‌యంలో ఇత‌ర పార్టీల నేత‌ల‌పై ఒక‌రిపై మ‌రొక‌రు విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేసుకుంటూ రాజ‌కీయ హీటును పెంచుతున్నారు. 
Also Read: రైతు ఉద్య‌మంపై నేడు ఎస్‌కేఏం ఏం నిర్ణ‌యం తీసుకోనుంది?

click me!