ఈ వ్యాక్సిన్లు.. ఒమిక్రాన్ పై ఎంత వరకు పనిచేస్తాయి..?

By Ramya news teamFirst Published Jan 12, 2022, 10:38 AM IST
Highlights

. దీనిపై యూరిపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ తాజాగా.. దీనిపై ఓ క్లారిటీ ఇచ్చింది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి.. ఒమిక్రాన్ సోకే అవకాశం ఉంది. అయితే.. ప్రాణాలు కోల్పోవడం.. వ్యాధి తీవ్రమై.. ఆస్పత్రిలో చేరడం లాంటివి మాత్రం జరకపోవచ్చని చెబుతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించడం మొదలుపెట్టింది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. చాపకింద నీరులా వ్యాపిస్తోంది. తేరుకునేలోపే.. ఒమిక్రాన్ కేసులు.. ప్రపంచ వ్యాప్తంగా లక్షల్లో నమోదౌతున్నాయి. అయితే.. గతేడాది డెల్టా వేరియంట్ విజృంభించిన తర్వాత.. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇఫ్పటి  వరకు చాలా మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే..  ఈ వ్యాక్సిన్లు.. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒమిక్రాన్ పై ఎంత వరకు ప్రభావం చూపిస్తాయి అనే అనుమానం చాలా మందిలో ఉంది.

కాగా.. దీనిపై యూరిపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ తాజాగా.. దీనిపై ఓ క్లారిటీ ఇచ్చింది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి.. ఒమిక్రాన్ సోకే అవకాశం ఉంది. అయితే.. ప్రాణాలు కోల్పోవడం.. వ్యాధి తీవ్రమై.. ఆస్పత్రిలో చేరడం లాంటివి మాత్రం జరకపోవచ్చని చెబుతున్నారు.

ఇప్పటి వరకు వచ్చిన కరోనా వేరియంట్ల కంటే.. ఒమిక్రాన్ ఎక్కువగా ఇతరులకు వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు గుర్తించారు. ఈ ఒమిక్రాన్ అత్యంత వేగవంతంగా.. ఇతరులకు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. అయితే...  వ్యాక్సిన్ తీసుకున్నవారిలో.. దీని తీవ్రత చాలా తక్కువగా ఉంటుందని చెప్పారు. డెల్టా వేరియంట్ తో పోలిస్తే.. మరణాల రేటు తక్కువగా ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ఇక.. తాజాగా బూస్టర్ డోసు కూడా  తీసుకున్నవారిలో.. ఈ ఒమిక్రాన్ ఎఫెక్ట్ మరింత తక్కువగా ఉండే అవాకశం ఉందని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. 

ఇదిలా ఉండగా.. దేశంలో.. వ్యాక్సిన్ పంపిణీ వేగం పెంచారు. ఈ మధ్యే.. టీనేజర్లకు కూడా వ్యాక్సిన్ వేయడానికి అనుమతి ఇచ్చారు. టీనేజ్ పిల్ల‌ల‌తో పాటు కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ (front line wariars), 60 ఏళ్లు పైబ‌డిన వృద్ధుల‌కు కూడా మ‌రో డోసు అధ‌నంగా ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. కోవిడ్ ముప్పు అధికంగా ఉండే వారికి ఒక డోసు అధ‌నంగా ఇవ్వడం వ‌ల్ల వారు సుర‌క్షితంగా ఉంటార‌ని ప్ర‌భుత్వం భావించింది. 

అయితే ఈ అధ‌న‌పు డోసును బూస్ట‌ర్ డోసు (booster dose)అని పేర్కొన‌కుండా ప్రికాష‌న‌రీ డోసు (precautionary dose) అని పేర్కొంది. ఈ ప్రికాష‌న‌రీ డోసును ఈ నెల ప‌దో తేదీ నుంచి ఇవ్వ‌డం ప్రారంభించింది. ఈ ప్రికాష‌న‌రీ డోసు కోసం ఎలాంటి రిజిస్ట్రేష‌న్ అవ‌స‌రం లేద‌ని తెలిపింది. నేరుగా వ్యాక్సినేష‌న్ సెంట‌ర్ కు (vaccination center)  వెళ్లి వృద్ధులు డాక్ట‌ర్ స‌ల‌హా మేర‌కు ఈ వ్యాక్సిన్ వేసుకోవ‌చ్చ‌ని చెప్పింది. 

సోమవారం ప్రారంభ‌మైన ఈ ప్రికాష‌న‌రీ డోసు కార్య‌క్ర‌మం మొద‌టి రోజు  విజ‌య‌వంతం అయ్యింది. దేశ వ్యాప్తంగా  9 లక్షల మంది లబ్ధిదారులు ఈ ప్రికాష‌నరీ డోసు వేసుకున్నార‌ని కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలు విడుద‌ల చేసిన డేటాలో వెల్ల‌డించాయి. మొద‌టి రోజు చేప‌ట్టిన వ్యాక్సినేష‌న్ డ్రైవ్ లో  9,84,676 మందికి మూడో డోసు అందింద‌ని తెలిపాయి. వీరిలో 5,19,604 మంది హెల్త్ వ‌ర్క‌ర్స్, 2,01,205 మంది ఫ్రంట్‌లైన్ కార్మికులు,  2,63,867 మంది 60 ఏళ్లు పైబ‌డిన వృద్ధులు ఉన్నారు. అయితే ఈ ప్రికాష‌న‌రీ డోసు పొందాలంటే రెండో డోసు పూర్తి చేసుకొని 9 నెల‌లు లేదా 39 వారాలు దాటి ఉండాలి. గ‌త రెండు డోసుల స‌మ‌యంలో ఏ వ్యాక్సిన్ వేశారో.. ఈ ప్రికాష‌నరీ డోసు కూడా అదే వ్యాక్సిన్ వేయ‌నున్నారు.

click me!