భారత్‌లో కరోనా విజృంభణ.. ఒక్క రోజే 1.94 లక్షల కొత్త కేసులు.. పెరిగిన మరణాలు..

Published : Jan 12, 2022, 09:42 AM ISTUpdated : Jan 12, 2022, 09:52 AM IST
భారత్‌లో కరోనా విజృంభణ.. ఒక్క రోజే 1.94 లక్షల కొత్త కేసులు.. పెరిగిన మరణాలు..

సారాంశం

దేశంలో కరోనా కేసుల (corona cases) సంఖ్య భారీగా పెరుగుతోంది. కరోనా మహమ్మారి దేశంలో మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తుంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,94,720 కరోనా కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

దేశంలో కరోనా కేసుల (corona cases) సంఖ్య భారీగా పెరుగుతోంది. కరోనా మహమ్మారి దేశంలో మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తుంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,94,720 కరోనా కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కిందటి రోజు కరోనాతో 277 మంది మృతిచెందగా.. గత 24 గంటల్లో కరోనాతో 442 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో దేశం ఇప్పటివరకు మహమ్మారితో మృతిచెందిన వారి సంఖ్య 4,84,655కి పెరిగింది. నిన్న దేశంలో కరోనా నుంచి 60,405 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 3,46,30,536కి చేరింది. ప్రస్తుతం దేశంలో 9,55,319 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

రోజువారి కరోనా పాజిటివిటీ రేటు 11.05 శాతంగా ఉంది. అదే సమయంలో వీక్లీ పాజిటివిటీ రేటు 9.82 శాతంగా ఉన్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక, దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతుంది. నిన్న దేశంలో 85,26,240 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,53,80,08,200కి చేరింది. దేశంలో ప్రస్తుతం 15 ఏళ్లు పైబడిన పిల్లలకు వ్యాక్సిన్ అందివ్వడంతో పాటుగా, ఫ్రంట్ లైన్ వర్కర్లకు, 60 ఏళ్లు పైబడిన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి బూస్టర్ డోస్ వేస్తున్నారు. 

మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. దేశంలో ఇప్పటివరకు 4,868 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో 1,805 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 1,281 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా, 645 ఒమిక్రాన్ కేసులతో రాజస్తాన్‌ రెండో స్థానంలో ఉంది. దేశంలో ఇప్పటివరకు 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. 

ఒమిక్రాన్ కేసుల విషయానికి వస్తే.. మహారాష్ట్రలో 1,281, రాజస్తాన్‌లో 645, ఢిల్లీలో 546, కర్ణాటకలో 479, కేరళలో 350, పశ్చిమ బెంగాల్‌లో 294, ఉత్తరప్రదేశ్‌లో 275, గుజరాత్‌లో 236, తమిళనాడులో 185, హర్యానాలో 162, తెలంగాణలో 123, ఒడిశాలో 102, ఆంధ్రప్రదేశ్‌లో 54, బిహార్‌లో 27, పంజాబ్‌లో 27, గోవాలో 21, జమ్మూ కశ్మీర్‌లో 13, మధ్యప్రదేశ్‌లో 10, అసోంలో 9, ఉత్తరాఖండ్‌లో 8, చత్తీస్‌గఢ్‌లో 5, మేఘాలయలో 5, అండమాన్ నికోబార్ దీవుల్లో 3, చంఢీఘర్‌లో 3, పుదుచ్చేరిలో 2, హిమాచల్ ప్రదేశ్‌లో 1, లఢఖ్‌లో 1, మణిపూర్‌లో 1 కేసు నమోదయ్యాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !