పోక్సో కేసుల్లో బాధితుల కోసం మహిళా న్యాయవాదులను నియమించండి - అలహాబాద్ హైకోర్టు

By team teluguFirst Published Aug 28, 2022, 11:02 AM IST
Highlights

పోక్సో కేసుల్లో బాధితుల కోసం మహిళా న్యాయమూర్తులను నియమించాలని అలహాబాద్ హైకోర్టు కోర్టు పేర్కొంది. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు తనకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. దీని విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 

లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద నమోదైన కేసుల్లో బాధితుల తరఫున వాదించేందుకు మహిళా న్యాయవాదులను నియమించాలని అల‌హాబాద్ హైకోర్టు పేర్కొంది. ఈ మేర‌కు కోర్టులోని లీగల్ సర్వీసెస్ కమిటీకి ఆదేశాలు జారీ చేసింది.

సీజేఐకు 134 మంది మాజీ సివిల్ సర్వెంట్ల బ‌హిరంగ‌ లేఖ.. బిల్కిస్ బానో కేసు దోషుల విడుద‌లపై అసంతృప్తి..

బాధితులకు ప్రాతినిధ్యం వహించడానికి లీగల్ సర్వీసెస్ కమిటీ న్యాయవాదిని ఎంపానెల్ చేసినప్పటికీ, అలాంటి కేసుల్లో మైనర్ బాలికల తరపున చాలా తక్కువ మంది మహిళా న్యాయవాదులు హాజరవుతున్నారని జస్టిస్ అజయ్ భానోట్ అన్నారు.  వికలాంగ మైనర్‌ దళిత బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొన్న ట్రక్కు.. ఐదుగురు మృతి

నిందితుడైన పిటిష‌న‌ర్ IPC సెక్షన్లు 376 (అత్యాచారం), POCSO చట్టం అలాగే SC, ST (అట్రాసిటీల నిరోధక) చట్టంలోని నిబంధనల ప్రకారం కేసు నమోదు అయ్యింది. నిందితుడు 2021 జూన్ 8 నుంచి జైలులోనే ఉన్నాడు. ఈ బెయిల్ పిటిష‌న్ ను సింగిల్ జడ్జి బెంచ్ విచారించింది. ఈ పిటిష‌న్ ను కోర్టు తిర‌స్క‌రించింది.

నేడు నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత: 3700 కిలోల పేలుడు పదార్ధాల వినియోగం

ఈ సంద‌ర్భంగా బెంచ్ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. బాధితురాలి మాటతీరు బలహీనంగా ఉండడంతో నేరం తీవ్రమైందని తెలిపింది. పిటిష‌నర్ నేరం చేసినట్టు రికార్డుల ద్వారా నిర్ధార‌ణ అయ్యింద‌ని బెంచ్ పేర్కొంది. కేసును రోజువారీ ప్రాతిపదికన విచారించాలని, ఒక సంవత్సరంలోపు విచారణను ముగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

click me!