మమతతో ముగిసిన బాబు భేటీ: ఢిల్లీకి పయనం

Siva Kodati |  
Published : May 20, 2019, 07:13 PM IST
మమతతో ముగిసిన బాబు భేటీ: ఢిల్లీకి పయనం

సారాంశం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ ముగిసింది

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ విడుదలవ్వడం, గురువారం కౌంటింగ్ ఉండటంతో ఎన్డీయేతర కూటమిపై బాబు ప్రయత్నాలు విస్తృతం చేశారు.

సోమవారం మధ్యాహ్నం అమరావతి నుంచి నేరుగా కోల్‌కతా వెళ్లారు. మమత అధికారిక నివాసంలో ఇద్దరు నేతలు అరగంట పాటు చర్చలు జరిపారు. అనంతరం చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.

మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 23 ఎన్డీయేతర పక్షాల నేతలు ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై చంద్రబాబు సమీక్షించే అవకాశం ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?