కార్టూన్లమా... మీడియాకు భయపడను, లెక్కచేయను: కుమారస్వామి

By Siva KodatiFirst Published May 20, 2019, 5:42 PM IST
Highlights

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మీడియాపై గుర్రుగా ఉన్న కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. జేడీఎస్- కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఎన్నో రోజులు నిలిచేలా లేదని స్థానికంగా ఉన్న మీడియా కథనాలు ప్రచురించడంతో కుమారస్వామి చిర్రుబుర్రులు ఆడారు

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మీడియాపై గుర్రుగా ఉన్న కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. జేడీఎస్- కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఎన్నో రోజులు నిలిచేలా లేదని స్థానికంగా ఉన్న మీడియా కథనాలు ప్రచురించడంతో కుమారస్వామి చిర్రుబుర్రులు ఆడారు.

రాజకీయ నాయకుల గురించి మీరేమనుకుంటున్నారు... ? మీరెన్ని వ్యంగ్యాస్త్రాలు సంధించినా పడి ఉండాలనా..? ఇలా ఏది పడితే అది రాయడానికి మీకన్ని అధికారులు ఎవరిచ్చారు..?

ప్రజల్లో మా ప్రభుత్వం పట్ల అనుమానాలు రేకెత్తించమని మీకెవరు చెప్పున్నారు..? మీ వెనుక ఉన్నదేవరు..? వీటన్నింటినీ నియంత్రించేందుకు ఒక చట్టాన్ని తీసుకురావాలనిపిస్తోందని కుమారస్వామి మండిపడ్డారు.

మేం మీడియాతో ఆదరణతో బతకడం లేదు... 6.5 కోట్ల మంది ప్రజల ఆశీస్సుల వల్ల మనుగడ సాగిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. మీడియాకు నేనే మాత్రం భయపడను.. లెక్కచేయను కూడా...

ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన కథనాలను చూస్తే నాకు నిద్ర పట్టదేమో... జేడీఎస్- కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడం అంత ఈజీ కాదని కుమారస్వామి తెలిపారు. తమకు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య అండ ఉందని కర్ణాటక ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. 

click me!