తమిళనాడులో ఎన్ఏఐ దాడులు: 10 ప్రాంతాల్లో సోదాలు

Siva Kodati |  
Published : May 20, 2019, 06:13 PM IST
తమిళనాడులో ఎన్ఏఐ దాడులు: 10 ప్రాంతాల్లో సోదాలు

సారాంశం

తమిళనాడులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని 10 ప్రాంతాలలో ఏక కాలంలో తనిఖీలు చేస్తోంది. 

తమిళనాడులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని 10 ప్రాంతాలలో ఏక కాలంలో తనిఖీలు చేస్తోంది. రామనాథపురం, చిదంబరం,సేలం, దేవీపట్నం, ముత్తుపేట, లాలాపేట సహా పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు.

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలతో గత నెలలో మొహ్మద్ ఆసిఫ్, సైదుల్లా అనే ఇద్దరు వ్యక్తుల ఇళ్లలో ఎన్ఐఏ దాడులు జరిపింది. వీరు గతంలో ఐసిస్‌కు అనుకూలంగా వాల్ పోస్టర్లు అంటించారు.

ప్రస్తుతం జరుగుతున్న సోదాల్లో మూడు లాప్‌ట్యాప్‌లు, 3 హార్డ్‌డిస్క్‌లు, 16 సెల్‌ఫోన్లు, 8 సిమ్‌కార్డులు, 2 పెన్‌డ్రైవ్‌లు, 5 మెమొరీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.  

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?