కేంద్రం చేతికి ఎపీ కీలక ప్రాజెక్ట్!.. ఏపీలో బీజేపీ కొత్త ఎత్తుగడ

By narsimha lodeFirst Published Oct 14, 2019, 10:34 AM IST
Highlights

కేంద్ర జలశక్తి మంత్రితో  ఏపీ బీజేపీ నేతల  సమావేశం ముగిపింది. ఈ భేటీ గంటపాటు సాగింది.  పోలవరం ప్రాజెక్టు అంశం పై మంత్రితో బీజేపీ నేతలు చర్చించారు.  
అనంతరం సమావేశ వివరాలను మీడయా వెల్లడించారు. ఏపీ ప్రజలకు,పోలవరం చాలా ముఖ్యమైన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్‌ని నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని కేంద్రం భావిస్తుందన్నారు   

కేంద్ర జలశక్తి మంత్రితో  ఏపీ బీజేపీ నేతల  సమావేశం ముగిపింది. ఈ భేటీ గంటపాటు సాగింది.  పోలవరం ప్రాజెక్టు అంశం పై మంత్రితో బీజేపీ నేతలు చర్చించారు. అనంతరం సమావేశ వివరాలను మీడయా వెల్లడించారు. ఏపీ ప్రజలకు,పోలవరం చాలా ముఖ్యమైన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్‌ని నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని కేంద్రం భావిస్తుందన్నారు  

ఏపీలో ప్రభుత్వం మారిన తరువాత పోలవరానికి సంబంధించి రివర్స్ టెండర్ సహా ఇతర అంశాలకు సంబందించిన వివరాలేవి కేంద్రం వద్ద లేవన్నారు.
ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదన్నారు.


 ప్రభుత్వ స్పందనను బట్టి కేంద్ర ప్రభుత్వ తదుపరి నిర్ణయం ఉంటుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును త్వరిత గతిన పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యం
గా ఉందన్నారు.  మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడా అవినీతి జరగకుండా చూస్తున్నమన్నారు. పోలవరం అంశంపై  కేంద్ర జల శక్తి మంత్రి  గజేంద్ర సింగ్ షెకావత్ కూడా స్పందించారు.

"ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలన్నదే మా లక్ష్యం. ప్రధాని ఆకాంక్ష కూడా అదే గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా మాత్రమే చూసింది.. దాన్ని త్వరగా పూర్తి చేయలని వారు అనుకోలేదు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పొలవరాన్ని త్వరగా పూర్తి చేసే ఉద్దేశ్యం లేదన్నారు"మంత్రి  గజేంద్ర సింగ్ 

 

పోలవరం ఏపీకి గుండెకాయ లాంటి ప్రాజెక్ట్ అని రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పట్టించు కోవడం లేదని విమర్శించారు. టీడీపీ,వైసీపీ రెండు పోలవరం ప్రాజెక్టును రాజకీయ కోణంలోనే మాత్రమే చూశాయన్నారు.  పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు మంత్రి .

భేటీ అంనతరం ఏపీ బీజేపీ శాఖ అద్యక్షుడు కన్నాలక్ష్మి నారయణ  కూడా స్పందించారు.గతంలో కేంద్ర ప్రాజెక్ట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఎలా కడతుందని వైసీపీ టీడీపీని ప్రశ్నించింది..ఇప్పుడు  ఆ అంశంపై  వైసీపీ స్టాండ్ ఎంటో జగన్ స్పష్టం చేయాలన్నారు. 
 

click me!