రోడ్డు ప్రమాదం... నలుగురు జాతీయస్థాయి హాకీ ప్లేయర్స్ మృతి

Published : Oct 14, 2019, 10:13 AM IST
రోడ్డు ప్రమాదం... నలుగురు జాతీయస్థాయి హాకీ ప్లేయర్స్ మృతి

సారాంశం

నలుగురు జాతీయ స్థాయి హాకీ ఆటగాళ్లు అక్కడికక్కడే మృతి చెందగా... పలువురు గాయాలపాలయ్యారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు  చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.   

మధ్యప్రదేశ్ లో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హోషగాబాద్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు జాతీయస్థాయి హాకీ ఆటగాళ్లు ప్రాణాలు కోల్పోయారు. 

పూర్తి వివరాల్లోకి వెళితే... సోమవారం తెల్లవారు జామున పలువురు యువకులు కారులో వెళ్తుండగా హోషగాబాద్ వద్ద వారు కారు ప్రమాదానికి గురయ్యింది. వారి కారు వేగంగా వెళ్లి చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు జాతీయ స్థాయి హాకీ ఆటగాళ్లు అక్కడికక్కడే మృతి చెందగా... పలువురు గాయాలపాలయ్యారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు  చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

కారు వేగంగా వెళుతుండటంతో... డ్రైవర్ దానిని అదుపుచేయలేకపోయాడు. దీంతో వెళ్లి చెట్టును ఢీకొట్టిందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు సంఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 

 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌