ఘోర ప్రమాదం... గ్యాస్ సిలిండర్ పేలి 10మంది మృతి

Published : Oct 14, 2019, 09:37 AM IST
ఘోర ప్రమాదం... గ్యాస్ సిలిండర్ పేలి 10మంది మృతి

సారాంశం

భవనం కుప్పకూలడంతో శిథిలాల కింద చిక్కుకొని వీరు చనిపోయారు. ఇప్పటికే 10మంది మృతి చెందగా... మరో 15మంది తీవ్రంగా గాయపడ్డారు.   

ఉత్తరప్రదేశ్ లో మొహ్మదాబాద్ లో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి దాదాపు 10మంది మృతి చెందారు. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో రెండు అంతస్తుల భవనం కూలిపోయింది. భవనం కుప్పకూలడంతో శిథిలాల కింద చిక్కుకొని వీరు చనిపోయారు. ఇప్పటికే 10మంది మృతి చెందగా... మరో 15మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

పలువురు ఇంకా శిథిలాల కింద చిక్కుకొని ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. సహాయక సిబ్బంది.. సహాయక చర్యలు చేపడుతున్నారు.  ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Bank Jobs : మంచి మార్కులుండి, తెలుగులో మాట్లాడితే చాలు.. రాత పరీక్ష లేకుండానే బ్యాంక్ జాబ్స్
Budget Friendly Cars : కొత్తగా జాబ్ లో చేరినవారు కూడా కొనగలిగే టాప్ 5 కార్లు ఇవే..