పెళ్లైనవాడితో అక్రమ సంబంధం.. ప్రసాదంలో విషం కలిపి

Published : Jan 30, 2019, 09:46 AM IST
పెళ్లైనవాడితో అక్రమ సంబంధం.. ప్రసాదంలో విషం కలిపి

సారాంశం

పెళ్లైన వ్యక్తితో వివాహేతర సంబంధం సజావుగా కొనసాగేందుకు అతని భార్యను చంపింది.

మానవ సంబంధాలు రోజు రోజుకీ మరింత దారుణంగా తయారౌతున్నాయి.  పెళ్లైన వ్యక్తితో వివాహేతర సంబంధం సజావుగా కొనసాగేందుకు అతని భార్యను చంపింది. చివరకు పోలీసులకు చిక్కి జైల్లో ఊచలు లెక్కపెడుతోంది. ఈ దారుణ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. 

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరుకి చెందిన లోకేష్ అనే వ్యక్తికి గౌరి అనే మహిళతో వివాహం జరిగింది. కాగా..లోకేష్ కి కొద్ది నెలల క్రితం లక్ష్మి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త.. వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో వీరి బంధానికి అడ్డుగా ఉందని గౌరిని చంపేందుకు పథకం వేశారు. మూడు సార్లు ప్లాన్ చేసి విఫలం చెందగా.. తాజాగా ప్రసాదంలో విషం కలిపి ఆమెను చంపేశారు.

గుడిలో ప్రసాదం తిని గౌరితో పాటు కవిత అనే మరో మహిళ కూడా ప్రాణాలు కోల్పోయింది. ప్రసాదం తిని చనిపోవడంతో పోలీసు కేసు అయ్యింది. విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. లోకేష్, అతని ప్రియురాలు లక్ష్మి ఈ పథకం వేశారని దర్యాప్తులో తేలింది.

ప్రసాదంలో బంగారు ఆభరణాల తయారీకి వినియోగించే ప్రమాదకరమైన రసాయనాలను ప్రసాదంలో కలిపినట్లు పరీక్షలలో తేలిందన్నారు.తన ఇంట్లో పనిచేసే అమరావతి, దేవాలయం వద్ద పూలు అమ్మే పార్వతిల సహకారంతో లక్ష్మి ఈ దురాగతానికి పాల్పడినట్లు గుర్తించామన్నారు. ఈ ఘటనలో గౌరితోపాటు కవిత మృతి చెందగా విష పదార్థాన్ని కలిపిన కేసరిబాత్‌ను తీసుకున్న మిగిలిన 15మంది పూర్తిగా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారన్నారు.

లక్ష్మి, ఆమెకు సహకరించిన అమరావతి, పార్వతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోకేష్ ప్రస్తుతం పరారీలో ఉండగా.. అతని  కోసం గాలిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్