గోవాలో మహిళా డెంటిస్ట్ తో రాహుల్ గాంధీ.. ఫోటోలు వైరల్

Published : Jan 29, 2019, 11:44 AM IST
గోవాలో మహిళా డెంటిస్ట్ తో రాహుల్ గాంధీ.. ఫోటోలు వైరల్

సారాంశం

తాజాగా ఆయన ఓ మహిళా డెంటిస్ట్ తో దిగిన ఫోటో ఒకటి వైరల్ గా మారింది.

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు, పార్టీ కార్యక్రమాలతో తీరికలేకుండా గడిపిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాముల్ గాంధీ ప్రస్తుతం గోవా పర్యటనకు వెళ్లారు. తన తల్లి సోనియాతో కలిసి  ఆయన ఆదివారం గోవా పర్యటనకు వెళ్లారు. తన వ్యక్తిగత భద్రతా సిబ్బంది లేకుండా సాధారణ పర్యాటకుడిలా రాహుల్ అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి ఫేమస్ ఫుడ్ చేపలు, రొయ్యలు ఆరగిస్తున్నారు. 

అంతేకాకుండా అక్కడికి పర్యటనకు వచ్చిన టూరిస్ట్ లతో సెల్ఫీలు కూడా దిగుతున్నారు. తాజాగా ఆయన ఓ మహిళా డెంటిస్ట్ తో దిగిన ఫోటో ఒకటి వైరల్ గా మారింది. గోవాకు చెందిన ఫేమస్ డెంటిస్ట్ రచనా ఫెర్నాండెజ్ తన బంధువులతో కలిసి అదే రెస్టారెంట్‌కు భోజనం చేసేందుకు వచ్చింది. అక్కడా రాహుల్ కనబడటంతో అతనితో సెల్ఫీ దిగి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. మీతో(రాహుల్) ఫొటో దిగాలని ఉందని నేను అడగ్గానే.. బిల్లు కట్టి వచ్చిన తర్వాత సెల్ఫీ దిగుతానని తనతో రాహుల్ చెప్పారని ఫెర్నాండెజ్ తెలిపారు. 

మొదట రాహుల్ ని చూసి.. తన కజిన్ తో అచ్చం రాహుల్ గాంధీలాగా ఉన్నాడు కదా అని చెప్పానని.. సోనియాని చూసిన తర్వాత అతను నిజంగానే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అని తెలిసిందని చెప్పారు.

తాను ఆయనను చూడగానే.. అతను వెంటనే నవ్వారని ఫెర్నాండెజ్ తెలిపారు. తర్వాత మీతో(రాహుల్) ఫొటో దిగాలని ఉందని తాను అడగ్గానే.. బిల్లు కట్టి వచ్చిన తర్వాత సెల్ఫీ దిగుతానని తనతో రాహుల్ చెప్పారని ఫెర్నాండెజ్ తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu