Omicron cases: భారత్‌లో మరో ఒమిక్రాన్ కేసు నమోదు.. మొత్తం కేసులు ఎంతకు చేరాయంటే..?

By Sumanth Kanukula  |  First Published Dec 11, 2021, 11:32 AM IST

ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్(omicron) కేసుల సంఖ్య భారత్‌లోనూ క్రమంగా పెరుగుతుంది. తాజాగా ఢిల్లీలో (Delhi) మరో ఒమిక్రాన్ కేసు నిర్దారణ అయింది. జింబాబ్వే (Zimbabwe) నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ పాజటివ్‌గా నిర్ధారణ అయినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 


ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్(omicron) కేసుల సంఖ్య భారత్‌లోనూ క్రమంగా పెరుగుతుంది. తాజాగా ఇండియాలో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. జింబాబ్వే (Zimbabwe) నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ పాజటివ్‌గా నిర్ధారణ అయినట్టుగా ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. అయితే ఆ వ్యక్తి ఒమిక్రాన్ వెలుగుచూసిన దక్షిణాఫ్రికాను కూడా సందర్శించినట్టుగా పేర్కొంది. దీంతో ఢిల్లీలో (Delhi) ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2కి చేరింది. తాజా కేసులతో కలుపుకుని.. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల (omicron cases in india) సంఖ్య 33కు పెరిగింది. 

ఇక, భారత్‌లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. నిన్న ఒక్కరోజే మహారాష్ట్రలో ఏడు కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇప్పటివరకు దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులను గుర్తించారు. వాటిలో మహారాష్ట్రలో 17, గుజరాత్‌లో 3 , కర్ణాటకలో 2, రాజస్తాన్‌లో 9, ఢిల్లీలో 2 కేసులు ఉన్నాయి.   

Latest Videos

undefined

Also Read: Omicron scare: ఒమిక్రాన్ టెన్షన్.. మూడేళ్ల చిన్నారికి నిర్దారణ.. ముంబైలో 144 సెక్షన్..

ఇక, ఒమిక్రాన్ భయాందోళనల నేపథ్యంలో.. మహారాష్ట్ర రాజధాని ముంబైలో నేడు, రేపు 144 సెక్షన్ (Section 144 of the CrPC) విధించారు. ఈ మేరకు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు ఉత్తర్వులు జారీచేశారు. వీకెండ్ కావడంతో జనాలు బయటకు వచ్చే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఒమిక్రాన్ వ్యాప్తి కట్టడి చేయడంలో భాగంగా ముంబైలో ర్యాలీలు, ఊరేగింపులపై నిషేధం విధించారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ముంబై పోలీసు వర్గాలు తెలిపాయి. 

ఇదిలా ఉంటే భారత్‌లో గ‌త 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా.. 7,992 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,82,736కి చేరింది.  కొత్తగా 393 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,75, 128కి చేరింది. 24 గంటల వ్యవధిలో 9,265 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 559 రోజుల కనిష్ఠానికి చేరింది. ఇప్పటివరకు 131.99 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపినీ చేసినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

click me!