
ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ ఆలయంలో (Puri Jagannath Temple) దారుణం వెలుగుచూసింది. ఆలయంలో సేవకుడిగా ఉన్న ఓ వ్యక్తి బాలుడిపై లైంగిక వేధింపులకు (Sexually Harassing) పాల్పడ్డాడు. సీనియర్ సేవకుడిగా ఉన్న అతడు.. ఆలయ ప్రాంగణంలోనే ఈ విధంగా ప్రవర్తించాడు. ఈ ఆరోపణ నేపథ్యంలో శుక్రవారం అతడిని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు. పూరీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు నెలల క్రితం ఆయల సేవకుడిగా ఉన్న లక్ష్మీ నారాయణ్ ఖుంతియా పూరి జగన్నాథ ఆలయ ప్రాంగణంలోని 16 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా బాలుడి తండ్రి ఫిర్యాదు చేశాడు. దీంతో లక్ష్మీ నారాయణ్ ఖుంతియాపై పోక్సోతో పాటు ఐపీసీలోని 294, 377 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
‘నిందితుడు నా కొడుకును లక్ష్మీ దేవాలయం వెనుక ఉన్న ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్లాడు. చాలా రోజుల లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. చివరకు నా కొడుకు భరించలేకపోయాడు. గురువారం సాయంత్రం నా కొడుకు ఇందు గురించి తెలియజేసి బాధపడ్డాడ ”అని బాలుడి తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
Also read: కుమార్తెతో భిక్షాటన, వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి.. చైల్డ్ లైన్ అధికారులు వెళ్లడంతో...
ఇన్ని రోజులుగా బెదిరింపులకు గురిచేసినందుకు తన కొడుకు భయపడి ఈ విషయం బయటకు చెప్పలేదని బాలుడి తండ్రి చెప్పాడు. వేధింపులు రోజురోజుకు ఎక్కువ కావడంతో భరించలేక జరిగిన దారుణ ఘటనను చెప్పి బోరున విలపించాడని అన్నాడు. ఇందుకు సంబంధించి టెంపుల్ అధికారులతోపాటుగా, జిల్లా యంత్రాగానికి బాలుడి తండ్రి ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకన్న పోలీసులు నిందితుడు లక్ష్మీ నారాయణ్ ఖుంతియాను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.
ఇక, బాలుడి తండ్రి కూడా అదే ఆలయంలో సేవకుడిగా పనిచేస్తున్నాడు. అయితే అతడు అంధుడు కావడంతో కొడుకు రోజు ఆలయానికి తీసుకొచ్చేవాడు. ఈ క్రమంలోనే సీనియర్ సేవకుడిగా ఉన్న లక్ష్మీ నారాయణ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ‘నా కొడుకు ప్రతిరోజు జగన్నాథ ఆలయానికి నన్ను తీసుకొస్తాడు. రెండు నెలల క్రితం నా కొడుకు భువనేశ్వరి ఆలయానికి వెళ్తుండగా.. లక్ష్మీ ఆలయ సేవకుడు అతనిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అయితే దీనిని ప్రతిఘటిస్తే కొడతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. భయంతో నా కొడుకు వెళ్లి దర్శనం చేస్తుండగా మళ్లీ ఆ సీనియర్ సేవకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. బెదిరింపులకు పాల్పడుతూ.. ఆ రోజు నుంచి నా కొడుకును శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడు’ అని బాలుడి తండ్రి చెప్పాడు.