
మొబైల్ గేమ్‌లో స్నేహం చేసిన నోయిడా వ్యక్తిని వివాహం చేసుకోవడానికి పాకిస్తాన్‌కి చెందిన సీమా హైదర్ తన నలుగురు పిల్లలతో కలిసి భారతదేశంలోకి చొరబడినప్పటి నుండి సరిహద్దులు దాటిన సంబంధాలు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా భారత వీసా పొందడంలో విఫలమైన తర్వాత పాకిస్తాన్‌కు చెందిన ఒక మహిళ జోధ్‌పూర్‌కు చెందిన వ్యక్తిని వర్చువల్‌గా వివాహం చేసుకుంది. వివరాలు.. కరాచీ నివాసి అమీనా, జోద్‌పూర్‌కు చెందిన అర్బాజ్ ఖాన్‌లు.. భారత్‌లోనే వివాహం చేసుకోవాలని భావించారు. అయితే తన వివాహానికి వీసా పొందడంలో విఫలమైనందున అమీనా.. వర్చువల్‌గా వివాహం వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది.
ఈ క్రమంలోనే చార్టర్డ్ అకౌంటెంట్ అయిన అర్బాజ్ ఖాన్ బుధవారం పెళ్లి కోసం తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో జోధ్‌పూర్‌లోని ఓస్వాల్ సమాజ్ భవన్‌కు చేరుకున్నాడు. ఇక్కడ వర్చువల్‌గా నిఖా నిర్వహించడమే కాకుండా..కుటుంబం కూడా వేడుకల్లో మునిగిపోయింది. అర్బాజ్‌కి అన్ని వివాహ ఆచారాలను నిర్వహించేలా చేసింది. ఈ వేడుకను జోధ్‌పూర్ ఖాజీ నిర్వహించి.. దంపతులకు వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.
‘‘అమీనా వీసా కోసం దరఖాస్తు చేస్తుంది. నేను పాకిస్తాన్‌లో వివాహం చేసుకోలేను. అది గుర్తించబడదు. అక్కడ పెళ్లి చేసుకున్న కూడా మేము భారతదేశానికి చేరుకున్న తర్వాత మేము మళ్లీ వివాహం చేసుకోవాల్సి ఉంటుంది’’ అర్బాజ్ తెలిపారు.
ఇక, అమీనాతో తన సంబంధం గురించి అర్బాజ్ మాట్లాడుతూ.. ఇది అరేంజ్డ్ మ్యారేజ్ అని, ఇందుకోసం పాకిస్థాన్‌లోని అతని బంధువులు చర్చలు జరిపారని చెప్పాడు.‘‘మా కుటుంబ సభ్యులు ఈ వివాహాన్ని ఏర్పాటు చేశారు. నిఖా ఆన్‌లైన్‌లో చేయడానికి కారణం ఈ రోజుల్లో భారతదేశం, పాకిస్తాన్ మధ్య సంబంధాలు సరిగా లేకపోవడమే’’ అని పేర్కొన్నాడు. అమీనా త్వరలో వీసా పొంది భారత్‌కు రాగలదని అర్బాజ్ ఆశిస్తున్నాడు.