
Kalyan: తన సోదరితో నిత్యం గొడవలు పడుతున్నాడని ముగ్గరు సోదరులు ఆమె లివ్-ఇన్ పార్టనర్ పై క్రూరంగా దాడి చేసి, ప్రాణాలు తీశారు. అనంతరం మృతదేహాన్ని నదిలో పడేశారు. ఈ క్రమంలోనే అతను కనిపించకుండా పోవడంతో మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో ఈ హత్య గురించిన విషయాలు వెల్లడయ్యాయి. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
ఈ హత్యా ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. సోదరి లివ్ ఇన్ పార్టనర్ ను హత్య చేసి మృతదేహాన్ని ఉల్హాస్ నదిలో పడేసిన ముగ్గురు వ్యక్తులను థానే జిల్లా కల్యాణ్ లో శనివారం పోలీసులు అరెస్టు చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. నిందితుల్లో సదరు మహిళ ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. మృతుడు షెబాజ్ షేక్ (28) మృతదేహం ఇంకా లభ్యం కాలేదని ఖడక్‌పాడ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.
కొంతకాలం క్రితం విడాకులు తీసుకున్న ముంతాజ్ అనే మహిళతో షెబాజ్ షేక్ గత నాలుగేళ్లుగా లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నాడు. శుక్రవారం నుంచి షెబాజ్ షేక్ కనిపించకుండా పోయిన కేసులో ముంతాజ్ సోదరులు షోయబ్ షేక్, ఇర్షాద్ షేక్ లతో పాటు హేమంత్ బిచ్వాడే అనే మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తామే హత్య చేసినట్టు నిందితులు అంగీకరించారు.
ముంతాజ్ తో తరచూ గొడవపడుతుండటంతో వారు షెబాజ్ ను పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేసినట్టు నిందితులు చెప్పారని పోలీసు అధికారులు తెలిపారు. సోదరి లివ్ ఇన్ పార్టనర్ ను హత్య చేసి మృతదేహాన్ని ఉల్లాస్ నదిలో పడేసిన ముగ్గురు వ్యక్తులను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. మృతదేహం ఇంకా లభ్యం కాలేదని తెలిపారు. కేసు నమోదుచేసుకుని వారిని జైలుకు పంపినట్టు పోలీసులు పేర్కొన్నారు.