యెస్ బ్యాంక్ దివాళా... ఈడీ ముందు హాజరైన అనీల్ అంబానీ

Published : Mar 19, 2020, 11:31 AM IST
యెస్ బ్యాంక్ దివాళా... ఈడీ ముందు హాజరైన అనీల్ అంబానీ

సారాంశం

ఇప్పటికే అనీల్ అంబానీకి ఈడీ అధికారులు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆ సమన్ల ప్రకారం అంబానీ సోమవారం వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంది, అయితే ఆయన వ్యక్తిగత కారణాలను చూపుతూ హాజరుకు మరింత సమయం కావాలని కోరారు.

రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ గురువారం ఉదయం  ముంబైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి  చేరుకున్నారు. యెస్ బ్యాంకుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అనిల్ అంబానీని అధికారులు ప్రశ్నించనున్నారు. 

also Read యస్ బ్యాంక్ దివాళా... అనిల్ అంబానీకి కొత్త చిక్కులు, ఈడీ సమన్ల

కాగా... ఇప్పటికే అనీల్ అంబానీకి ఈడీ అధికారులు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆ సమన్ల ప్రకారం అంబానీ సోమవారం వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంది, అయితే ఆయన వ్యక్తిగత కారణాలను చూపుతూ హాజరుకు మరింత సమయం కావాలని కోరారు.

మనీలాండరింగ్ దర్యాప్తునకు సంబంధించి యెస్ బ్యాంక్ ప్రమోటర్ రానా కపూర్‌తో పాటు రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి గతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు ​​జారీ చేసింది. నిరర్ధక ఆస్తులుగా (ఎన్‌పిఎ) మారిన యెస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాల్లో అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు అత్యధికంగా రుణాలు తీసుకున్నాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అనిల్ అంబానీ సోమవారం ముంబైలోని ఈడీ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించారు. అయితే ఆయన నేడు ఈడీ ముందు హాజరయ్యారు.

PREV
click me!

Recommended Stories

UPSC Interview Questions : గోరింటాకు పెట్టుకుంటే చేతులు ఎర్రగానే ఎందుకు మారతాయి..?
Best Mileage Cars : బైక్ కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే.. రూ.30 వేల శాలరీతో కూడా మెయింటేన్ చేయవచ్చు