రాత్రి పూట అరుస్తున్నాయని... 20 వీధికుక్కలకు విషం పెట్టి... !

Published : Sep 23, 2021, 11:35 AM IST
రాత్రి పూట అరుస్తున్నాయని... 20 వీధికుక్కలకు విషం పెట్టి... !

సారాంశం

ఒడిశాలోని కటక్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. గత 20 రోజులుగా రాత్రి వేళలో విపరీతంగా అరుస్తూ.. నిద్రపోనివ్వడంలేదని.. మిఠాయి షాపు యజమాని (24) 20 వీధి కుక్కలకు విషపు ఆహారం ఇచ్చాడు. దీంతో ఆ కుక్కలు చనిపోయాయి. ఈ కేసులో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. రాత్రి వేళే కాదు.. ఉదయం వేళ్లలో తన షాపు దగ్గర కూడా ఒకటే అరుస్తూ, చిరాకు పుట్టిస్తున్నాయని ఈ పని చేశాడని పోలీసులు చెప్పారు.

కటక్ (ఒడిశా) : రాత్రి పూట కుక్కల అరుపులు (Howling) ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటాయి. మాంచి నిద్రలో ఇవి చాలా చిరాకును కలిగిస్తాయి. ఆ టైంలో వాటిని తరిమి కొట్టడమో.. మున్సిపాలిటీ వాళ్లకు ఫిర్యాదు చేయడమో చేస్తాం. కానీ ఒడిశా (Odisha)లో ఓ వ్యక్తి ఈ కారణంతో దారుణానికి తెగబడ్డాడు. ఏకంగా 20 వీధికుక్క(Stray Dogs)లను విషం (Poison) పెట్టి మట్టుబెట్టాడు (Killed). 

ఒడిశాలోని కటక్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. గత 20 రోజులుగా రాత్రి వేళలో విపరీతంగా అరుస్తూ.. నిద్రపోనివ్వడంలేదని.. మిఠాయి షాపు యజమాని (24)
20 వీధి కుక్కలకు విషపు ఆహారం ఇచ్చాడు. దీంతో ఆ కుక్కలు చనిపోయాయి. ఈ కేసులో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. రాత్రి వేళే కాదు.. ఉదయం వేళ్లలో తన షాపు దగ్గర కూడా ఒకటే అరుస్తూ, చిరాకు పుట్టిస్తున్నాయని ఈ పని చేశాడని పోలీసులు చెప్పారు.

స్థానికంగా ఉన్న ఓ ఖాళీ ప్రదేశంలోని గొయ్యిలో పది వీధికుక్కల మృతదేహాలు కనిపించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కటక్ నగరానికి ఉత్తరాన 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న తంగి-చౌడ్‌వార్ బ్లాక్‌లోని శంకర్‌పూర్ గ్రామ మార్కెట్, దాని పరిసర ప్రాంతాల్లో కూడా మరిన్ని కుక్కల మృతదేహాలను కనుగొన్నారు.

దారుణం : భర్త కళ్లముందే ‘ఐ లవ్ యు’ మెసేజ్ పెట్టి... టెర్రస్ బిల్డింగ్ మీదినుంచి దూకి భార్య ఆత్మహత్య.. !

కుక్కలు రాత్రిపూట అరవడం, అవి చేసే రచ్చ భరించలేకే విసుగు చెంది.. తాను కుక్కలకు విషం కలిపిన ఆహారాన్ని ఇచ్చానని నిందితుడు ఒప్పుకున్నాడని ఒక పోలీసు అధికారి చెప్పారు.

ఆ వ్యక్తిపై భారతీయ శిక్షాస్మృతి, జంతువుల పట్ల హింస నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడిందని, మృతదేహాలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించామని, తదుపరి దర్యాప్తు జరుగుతోందని ఆయన అన్నారు.

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !