ఫేస్ బుక్ లో ఫ్రెండ్షిప్ చేసి.. తీరా కలిశాక అరెస్ట్ చేసింది.. ఎందుకంటే...

Published : Aug 03, 2021, 03:21 PM IST
ఫేస్ బుక్ లో ఫ్రెండ్షిప్ చేసి.. తీరా కలిశాక అరెస్ట్ చేసింది.. ఎందుకంటే...

సారాంశం

మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను పట్టుకోవడంలో మహిళా ఎస్సై ప్రదర్శించిన ధైర్యసాహసాలకు ప్రశంసలు దక్కుతున్నాయి. కొన్ని రోజుల కిందట తనపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు ఓ మైనర్ బాలిక పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. అయితే అతడి గురించిన సమాచారం ఏది ఆమె వద్ద లేదు.  అతడు ఎలా ఉంటాడు.. అనేది తప్ప ఇతర విషయాలు పోలీసులకు చెప్పలేకపోయింది.

ఢిల్లీ : ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన యువతితో అతను స్నేహం చేశాడు. ఆమె తో చాటింగ్ చేశాడు. ఆపై మాటలు కలిపాడు. ఆమె కోరిక మేరకు ప్రత్యక్షంగా కలిసేందుకు కూడా సిద్ధమయ్యాడు. ఆమె చెప్పిన రెస్టారెంట్ కి వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళాక ఆమెను చూసి అతడి మైండ్ బ్లాంక్ అయింది. తనను పట్టుకోవడానికి ఓ మహిళ ఎస్సై వేసిన స్కె అది అని అర్థమయింది. 

మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను పట్టుకోవడంలో మహిళా ఎస్సై ప్రదర్శించిన ధైర్యసాహసాలకు ప్రశంసలు దక్కుతున్నాయి. కొన్ని రోజుల కిందట తనపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు ఓ మైనర్ బాలిక పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. అయితే అతడి గురించిన సమాచారం ఏది ఆమె వద్ద లేదు.  అతడు ఎలా ఉంటాడు.. అనేది తప్ప ఇతర విషయాలు పోలీసులకు చెప్పలేకపోయింది.

దీంతో నిందితుల్ని పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారింది. ఢిల్లీలోని దాబ్రీ పోలీస్స్టేషన్ ఎస్ఐ ప్రియాంక సైనీ ఈ కేసును చేపట్టారు.  ముందుగా ఫేస్బుక్లో ఓ ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి చాలామందికి ఫ్రెండ్ రిక్వెస్టులు పంపారు. ఈ రిక్వెస్ట్ కు నిందితుడి నుంచి స్పందన వచ్చింది.

తర్వాత ప్రియాంక అతడితో చాటింగ్ ప్రారంభించింది.  మెల్లగా మాటల్లోకి దించింది.  ప్రత్యక్షంగా కలుద్దామని అడిగింది.  ఓ రెస్టారెంట్లో ప్రియాంకను కలిసేందుకు నిందితుడు అంగీకరించాడు. అలా ప్రియాంక కోరిక మేరకు గత శనివారం ఓ రెస్టారెంట్ కు వచ్చిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో అతని గురించి చాలా విషయాలు బయటపడ్డాయి. అతను చాలా మంది బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తేలింది. అలాంటి నిందితుడిని ఎంతో తెలివిగా ట్రాప్ చేసిన si ప్రియాంక పై ప్రశంసల జల్లు కురుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌