
టర్కీలో భూకంపం ఎంతటి విధ్వంసం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వేలల్లో ప్రాణాలు కోల్పోయారు. భూకంపం తర్వాత... అక్కడి పరిస్థితులు... ప్రపంచాన్ని కదిలించాయి. శిథిలాల కింద చిక్కుకున్నవారి ఫోటోలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నవారు కూడా ఉన్నారు. కాగా.... ఇటీవల ఆ భూకంప సమయంలో తీసిన ఓ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. శిథిలా చిక్కుకొని గాయపడిన ఓ చిన్నారితో... భారత ఆర్మీ డాక్టర్ బీనా తివారి ఉన్నారు.
ఆమె ప్రస్తుతం భూకంప బాధిత రోగులకు చికిత్స చేయడానికి భారత సైన్యం తరపున నుంచి ఆమె టర్కీ వెళ్లారు. శిథిలాల నుండి రక్షించిన ఒక చిన్న అమ్మాయితో బీనా ఉన్న చిత్రం వైరల్ అయ్యింది. ఈ ఫోటో అందరినీ ఆకట్టుకుంది. కాగా...ఈ ఫోటో ఆనంద్ మహీంద్రా దృష్టిని కూడా ఆకర్షించింది. మంచి విషయాలను షేర్ చేయడంలో ఎప్పుడూ ముందుండే ఆయన ఈ ఫోటోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆమె ఫోటోని షేర్ చేసి... ఈ ఫోటో ఆయన ఇచ్చిన క్యాప్షన్ కూడా నెట్టింట ఆకట్టుకుంటోంది. “ఇస్కెండరున్‌లో భారత సైన్యం ఆధ్వర్యంలో ఉన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికతో మేజర్ బీనా తివారీ. ప్రపంచంలోని అతిపెద్ద సైన్యాల్లో మనది ఒకటి. వారికి రెస్క్యూ & శాంతి పరిరక్షక కార్యకలాపాలలో దశాబ్దాల అనుభవం ఉంది. ఇది భారతదేశపు గ్లోబల్ ఇమేజ్. #టర్కీ భూకంపం," అని ఆయన క్యాప్షన్ ఇచ్చారు.
ఈ చిత్రం నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. “మన సైనికులు చేసిన మంచి పని. వారి అపారమైన మద్దతును నేను నిజంగా అభినందిస్తున్నాను. ధన్యవాదాలు, ” అంటూ ఓ నెటిజనట్ ట్వీట్ చేశారు.
భారత ఆర్మీ అందిస్తున్న సేవలకు అందరూ ఫిదా అయిపోయారు. కామెంట్ల వర్షం కురుస్తోంది. కాగా.. ఫిబ్రవరి 6 న టర్కీ , సిరియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు పై 7.8 నమోదైంది. వారం పాటు ఈ భూ ప్రకంపనలు కొనసాగాయి. 50వేలకు పైగా మరణించినట్లు తెలుస్తోంది.