
Jammu and Kashmir Encounter: జమ్మూకాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. అంద్వాన్ సాగమ్ ప్రాంతంలో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈమేరకు భద్రతా బలగాలు సంబంధిత వివరాలు వెల్లడించాయి. "#Anantnag లోని అంద్వాన్ సాగమ్ ప్రాంతంలో ఎన్ కౌంటర్ ప్రారంభమైంది. పోలీసులు, భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని" అని కాశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు.
ఉగ్రవాదులు-భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, మే 5న జమ్మూకాశ్మీర్ లోని రాజౌరీ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్ కౌంటర్ లో జరిగిన పేలుడులో ఐదుగురు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, మే 4న బారాముల్లా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఏకే 47 రైఫిల్, ఒక పిస్టల్ సహా కీలక సామాగ్రి, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హతమైన ఇద్దరు ఉగ్రవాదులు స్థానికులని, నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందినవారని పోలీసులు తెలిపారు.